iDreamPost
android-app
ios-app

కేన్​ విలియమ్సన్​ను వదలని శని.. ఇలా వచ్చాడో లేదో వెంటనే..!

  • Author singhj Published - 11:28 AM, Sat - 14 October 23
  • Author singhj Published - 11:28 AM, Sat - 14 October 23
కేన్​ విలియమ్సన్​ను వదలని శని.. ఇలా వచ్చాడో లేదో వెంటనే..!

కేన్ విలియమ్సన్.. ప్రస్తుత తరం క్రికెట్​లో బెస్ట్ ప్లేయర్లలో ఒకడు. విరాట్ కోహ్లీ, జో రూట్ లాంటి వారితో పోల్చదగ్గ క్రికెటర్. సెంచరీల మీద సెంచరీలు బాదకపోయినా, రికార్డుల మీద రికార్డులు సృష్టించకపోయినా కేన్ చాలా స్పెషల్. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటం కేన్​కు తెలియదు. సింగిల్స్, డబుల్స్​తో స్ట్రయిక్ రొటేట్ చేయడం, చెత్త బంతులు దొరికితే బౌండరీలకు తరలించడం, మంచి బంతులకు రెస్పెక్ట్ ఇచ్చి డిఫెన్స్ చేయడమే విలియమ్సన్​కు తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్​లోనైనా కూల్​గా ఉంటూ మ్యాచ్​ను ముందుకు తీసుకెళ్తాడు కేన్​మామ.

బ్యాటింగ్​లోనే కాదు కెప్టెన్సీలోనూ కేన్ విలియమ్సన్ చాలా ప్రత్యేకం. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాదిరిగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టును నడిపిస్తాడు కేన్. ఒకవేళ ప్రెజర్ ఉన్నా దాన్ని తనలోనే ఉంచుకుంటాడు.. టీమ్​మేట్స్​కు చేరనివ్వడు. అప్పుడప్పుడు విఫలమైనా దాదాపుగా చాలా మటుకు మ్యాచుల్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్​లు ఆడుతూ మిగతా వారిలో స్ఫూర్తి నింపుతుంటాడు. గెలిచినా, ఓడినా విలియమ్సన్ ముఖంలో చిరునవ్వు చెరగదు. అందుకే అతడ్ని దేశాలకు అతీతంగా క్రికెట్ ఫ్యాన్స్ ఇష్టపడతారు. అయితే గాయాల వల్ల రేసులో వెనుకబడిపోయాడు కేన్ మామ.

వరుస ఇంజ్యురీలు కేన్ కెరీర్​ను ప్రశ్నార్థకం చేశాయి. ఈ వరల్డ్ కప్​లో కూడా అతడు ఆడేది అనుమానంగా మారింది. అయినా సరైన టైమ్​కు కోలుకున్న ఈ న్యూజిలాండ్ సారథి.. బంగ్లాదేశ్​తో మ్యాచ్​కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్​లో కివీస్ 8 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. కమ్​బ్యాక్​లో ఆడిన తొలి మ్యాచులోనే విలియమ్సన్ (78) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్​లో గెలిచినా న్యూజిలాండ్ టీమ్ సంతోషంగా లేదు. దీనికి కారణం మళ్లీ విలియమ్సన్​కు గాయమవ్వడమే. రన్​ తీస్తున్న క్రమంలో బంగ్లా ఫీల్డర్ విసిరిన త్రో కాస్తా కేన్ మామ ఎడమ చేతి బొటన వేలికి తగిలింది.

బాల్ గట్టిగా తగలడంతో నొప్పితో విలవిల్లాడిన విలియమ్సన్ హాఫ్​ సెంచరీ తర్వాత రిటైర్డ్​హర్ట్​గా వెనుదిరిగాడు. ఇవాళ అతడి చేతికి ఎక్స్​రే తీస్తారు. ఒకవేళ ఇంజ్యురీ చిన్నదే అయితే కేన్ మామ మళ్లీ ఆడతాడు. గాయం పెద్దదైతే మాత్రం కివీస్​కు కష్టాలు తప్పకపోవచ్చు. విలియమ్సన్ ఇంజ్యురీపై ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు. పాపం.. కేన్ మామను బ్యాడ్ లక్ వదలడం లేదని.. అలా కమ్​బ్యాక్ ఇచ్చాడో లేదో మళ్లీ గాయమైందని కామెంట్స్ చేస్తున్నారు. విలియమ్సన్ త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి.. కేన్ విలియమ్సన్ వరుసగా గాయాల బారిన పడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup 2023: ఇండియా-పాకిస్థాన్​ మ్యాచ్​లో గెలిచేదెవరు?