iDreamPost
android-app
ios-app

కోహ్లీ, గిల్ కోసం ఇషాన్ సాహసం.. వాళ్ల ఫ్రెండ్​షిప్ అలాంటిది!

  • Author singhj Published - 08:27 PM, Thu - 2 November 23

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, శుబ్​మన్ గిల్ కోసం యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సాహసం చేశాడు. రియల్ ఫ్రెండ్​షిప్​ అంటే ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.

భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, శుబ్​మన్ గిల్ కోసం యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సాహసం చేశాడు. రియల్ ఫ్రెండ్​షిప్​ అంటే ఏంటో మరోమారు ప్రూవ్ చేశాడు.

  • Author singhj Published - 08:27 PM, Thu - 2 November 23
కోహ్లీ, గిల్ కోసం ఇషాన్ సాహసం.. వాళ్ల ఫ్రెండ్​షిప్ అలాంటిది!

క్రికెట్​లో ప్లేయర్ల మధ్య పోటీతత్వమే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రత్యర్థి ఆటగాళ్లను టీజ్ చేయడం, స్లెడ్జ్ చేయడం జెంటిల్మన్ గేమ్​లో చాలా కామన్. సొంత జట్టు ప్లేయర్ల మధ్య కూడా పోటీతత్వం ఎక్కువగానే ఉంటుంది. టీమ్​లో ఒక ప్లేస్ కోసం ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు ప్లేయర్లు ఇలాంటి పోటీని పెద్దగా పట్టించుకోరు. సాటి క్రికెటర్లతో బాగా కలసిపోతారు. క్రికెట్ ఫీల్డ్​తో పాటు బయట కూడా మంచి ఫ్రెండ్స్ అయిన ఆటగాళ్లను చూసే ఉంటారు. అలాంటి స్నేహితుల్లో శుబ్​మన్ గిల్-ఇషాన్ కిషన్​ను కూడా చేర్చొచ్చు. వీళ్లిద్దరిలో ఒకరు టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా మారగా.. మరొకరు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు.

గిల్ దాదాపుగా భారత్ ఆడే అన్ని మ్యాచుల్లోనూ ఆడుతున్నాడు. అయితే ఇషాన్ కిషన్​ మాత్రం మ్యాచ్ కండీషన్స్​, అవసరాన్ని బట్టి టీమ్​లోకి వస్తూ పోతున్నాడు. కానీ తనకు దక్కిన ప్రతి ఛాన్స్​ను అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. గిల్, ఇషాన్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న స్నేహాన్ని మరోసారి బయటపెట్టాడు ఇషాన్. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో బ్రేక్ టైమ్​లో ఇషాన్ ఓ సాహసం చేశాడు. గిల్ కోసం ఏకంగా గొడుగు తీసుకొని గ్రౌండ్​లోకి వెళ్లాడు.

బ్యాటింగ్ చేస్తూ అలసిపోయిన శుబ్​మన్ గిల్​కు ఎండ తగలకుండా కాపాడాడు ఇషాన్ కిషన్. ఆ సమయంలో గిల్​తో పాటు విరాట్ కోహ్లీ కూడా గ్రౌండ్​లోనే ఉన్నాడు. గిల్, కోహ్లీ కోసం ఇషాన్ గొడుగు తీసుకొని నిలబడిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్.. ఇది కదా రియల్ ఫ్రెండ్​షిప్ అని మెచ్చుకుంటున్నారు. గిల్ కోసం ఇషాన్ కిషన్ ఎప్పుడూ ఉంటాడని.. తన స్నేహితుడి కోసం అతడు నిలబడతాడని మెచ్చుకుంటున్నారు. మరి.. గిల్ కోసం ఇషాన్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌లో మూడోసారి 80 దాటి అవుటైన కోహ్లీ! ఎందుకిలా..?