వన్డే వరల్డ్ కప్‌లో భారత్ జోరును సౌతాఫ్రికా కూడా ఆపలేకపోయింది. టీమిండియా ధాటికి ఆ టీమ్ చిత్తు చిత్తయింది. సెమీస్‌కు ముందు టేబుల్లో టాప్-2లో ఉన్న సఫారీ టీమ్‌ను ఇలా ఓడించడం భారత్ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుందనే చెప్పాలి.
వన్డే వరల్డ్ కప్‌లో భారత్ జోరును సౌతాఫ్రికా కూడా ఆపలేకపోయింది. టీమిండియా ధాటికి ఆ టీమ్ చిత్తు చిత్తయింది. సెమీస్‌కు ముందు టేబుల్లో టాప్-2లో ఉన్న సఫారీ టీమ్‌ను ఇలా ఓడించడం భారత్ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుందనే చెప్పాలి.
వన్డే వరల్డ్ కప్-2023లో జైత్రయాత్రను కొనసాగిస్తూ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ భారత టీమ్ విజయ ఢంకా మోగించింది. ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. మరో సెమీస్ జట్టు సౌతాఫ్రికాను ఆదివారం ఏకంగా 243 రన్స్ తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్) తన బర్త్ డే నాడు సెంచరీతో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ (77), రోహిత్ శర్మ (40), రవీంద్ర జడేజా (29 నాటౌట్) కూడా రాణించారు.
బౌలింగ్‌లో జడేజా (5/33) విజృంభించడంతో సౌతాఫ్రికా టీమ్ 27.1 ఓవర్లలో కేవలం 83 రన్స్‌కే చాప చుట్టేసింది. మహ్మద్ షమి (2/18), కుల్దీప్ యాదవ్ (2/7), మహ్మద్ సిరాజ్ (1/11) తమ బౌలింగ్‌తో ఇంప్రెస్ చేశారు. వచ్చే ఆదివారం తన లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొననుంది భారత్. మరి.. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన భారీ విజయం సాధించడానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కారణాల్లో ముందుగా బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అంతగా సహకరించ లేదు. బాల్ సరిగ్గా బ్యాట్ మీదకు రాకపోవడంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 270 రన్స్ చేసినా గొప్పే అనిపించింది. ఇదే విషయాన్ని మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు.
బ్యాటింగ్ కష్టంగా మారిన కోల్‌కతా వికెట్‌పై ఓపెనింగ్‌లో అదరగొట్టాడు రోహిత్ శర్మ. అతడు 24 బంతుల్లోనే 40 రన్స్ బాదాడు. హిట్‌మ్యాన్‌కు తోడుగా బరిలోకి దిగిన మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా 23 రన్స్ చేశాడు. ఈ జోడీ 5.5 ఓవర్లలోనే 62 రన్స్ జోడించారు. దీంతో భారత్‌కు కావాల్సిన స్టార్ట్ దొరికింది. ఆ తర్వాత రోహిత్, గిల్ ఔటైనా కోహ్లీ, అయ్యర్, జడేజాలు భారీ స్కోరు దిశగా భారత్‌ను తీసుకెళ్లారు. ముఖ్యంగా విరాట్-అయ్యర్లు పరుగుల కోసం పరితపించకుండా పిచ్‌ను అర్థం చేసుకున్నారు. ఒక్కో రన్ కోసం తీవ్రంగా శ్రమించారు. డాట్ బాల్స్ ఎక్కువగా ఆడినా ఫర్వాలేదు.. తర్వాత రన్స్ చేయొచ్చనే ధీమాతో ఇన్నింగ్స్‌ను కంటిన్యూ చేశారు. ఈ సూత్రం ఫలించి ఆఖరి ఓవర్లలో బాగా రన్స్ వచ్చాయి.
బ్యాటర్లు రాణించడంతో భారీ స్కోరు చేసిన భారత్.. బౌలర్లు కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తే గెలుస్తామనే ధీమాతో కనిపించింది. కానీ టీమిండియా బౌలర్లు ఎక్స్పెక్టేషన్స్కు మించి రాణించారు. సఫారీ టీమ్‌ను 83 రన్స్‌కే కుప్పకూల్చారు. ఏ దశలోనూ ఆ టీమ్‌కు కోలుకునేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. భారత్ మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటి. పేసర్లు బుమ్రా, సిరాజ్, షమి ఎక్కువ వికెట్లు తీయలేదు. కానీ సౌతాఫ్రికా బ్యాటర్లకు డాట్ బాల్స్ వేస్తూ ఫస్ట్ బాల్ నుంచి ఒత్తిడి పెంచారు. దీన్ని వినియోగించుకున్న స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ వికెట్ల పండుగ చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలసి ఏకంగా 7 వికెట్లు తీశారు. జడేజా-కుల్దీప్ ద్వయం తమ స్పిన్ మాయాజాలంతో సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
జడేజా-కుల్దీప్ జోడీ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి సక్సెస్‌కు ప్రధాన కారణాల్లో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు. బ్యాటింగ్‌కు కష్టంగా మారిన వికెట్‌పై రోహిత్ శర్మ (24 బంతుల్లో 40), శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. వీళ్లు గనుక ఇలా ఆడకపోతే మిగతా బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడేది. భారత్ అంత భారీ స్కోరు చేసేది కాదు.. ఛేజింగ్‌కు దిగిన సఫారీ టీమ్ మీద ప్రెజర్ పడేది కాదు. కాబట్టి రోహిత్, అయ్యర్ మెరుపు బ్యాటింగ్ భారత్ గెలుపునకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇక ఆఖరుగా టాస్ గురించి మాట్లాడుకోవాలి.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ నెగ్గడం టీమిండియా విజయానికి కారణాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. సౌతాఫ్రికా ఛేజింగ్ చేయడంలో ఎప్పుడూ తడబడుతుంది. అందుకే టాస్ గెలవగానే రోహిత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మంచి స్కోరు చేయడంతో ఆ టీమ్ టెన్షన్‌కు గురైంది. అనుకున్నట్లుగానే ఒత్తిడిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. సౌతాఫ్రికాలాగే భారత్ కూడా ఛేజ్ చేసుంటే చాలా ఇబ్బంది పడేది. అందుకే టాస్ గెలవడం మనకు కలిసొచ్చింది. మరి.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత పెర్ఫార్మెన్స్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అడవి శేష్ మంచి మనసు.. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం..