iDreamPost
android-app
ios-app

ప్రియురాల్ని ఓయో హోటల్ కు తీసుకెళ్లి.. రెండు రోజుల తర్వాత..

ప్రియురాలు ప్రేమించేంత వరకు వెంటపడుతుంటారు. ప్రేమించాక.. మరో రకమైన టార్చర్ చూపిస్తుంటారు ప్రియుడు. వాళ్లతో మాట్లాడొద్దని, అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడకు వెళ్లొద్దు అని రూల్స్ పాస్ చేస్తుంటారు. దీంతో అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. ఇవే..

ప్రియురాలు ప్రేమించేంత వరకు వెంటపడుతుంటారు. ప్రేమించాక.. మరో రకమైన టార్చర్ చూపిస్తుంటారు ప్రియుడు. వాళ్లతో మాట్లాడొద్దని, అక్కడికి వెళ్లొద్దు, ఇక్కడకు వెళ్లొద్దు అని రూల్స్ పాస్ చేస్తుంటారు. దీంతో అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. ఇవే..

ప్రియురాల్ని ఓయో హోటల్ కు తీసుకెళ్లి.. రెండు రోజుల తర్వాత..

ఇటీవల లవ్ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. కొత్త భాష్యం చెబుతున్నారు ప్రేమికులు. ప్రేమ పేరుతో సెల్ ఫోన్లలో చాటింగ్స్, ఫోన్ కాల్స్ సీజన్ ముగిసిపోయింది. ప్రేమించుకున్నామా అయితే డేటింగ్ పేరుతో రిలేషన్ మెయిన్ టైన్ చేస్తున్నారు. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో వీకెండ్స్, సెలవులు వచ్చినప్పుడు హోటల్ రూమ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. లవర్ గురించి ఓ అవగాహనకు రావచ్చు అన్న ఉద్దేశంతో అమ్మాయిలు సైతం బిడియం లేకుండా ప్రియుడు రమ్మన్న చోటుకు వెళుతూ.. సమస్యను పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎంతో ఉన్నత చదువుకుని, మంచి ఉద్యోగాల్లో ఉన్న యువతులు సైతం కించిత్ ఆలోచన చేయకుండా వెళ్లి ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఇదిగో ఈ అమ్మాయిలా

పూణేలోని ఐటీ ఉద్యోగి వందనా ద్వివేదిని ఓయో హోటల్లో తుపాకీ గాయాలతో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి హోటల్ రూంకు వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఆ హోటల్ నుండి ఓ వ్యక్తి వెళుతున్నట్లు కనిపించింది. అనుమానితుడిగా భావిస్తున్నఆ వ్యక్తి ముంబయి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోకు చెందిన రిషబ్ నిగమ్, పూణెలోని ఇన్ఫోసిస్ లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్న వందన కొన్ని సంవత్సరాలను ప్రేమించుకుంటున్నారు.

ఇటీవల వందన క్యారెక్టర్‌పై ప్రియుడు అనుమానం పెంచుకున్నాడు. దీనిపై తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమెను అంతమొందించాలని పక్కా ప్రణాళిక వేసుకున్నాడు రిషబ్. ఈ నెల 25న వందనను కలిసేందుకు పూణే వచ్చాడు. ఇద్దరూ కలిసి హింజవాడిలోని ఓయో టౌన్ హౌస్ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నారు. రెండు రోజుల తర్వాత ఆమెను తుపాకీతో కాల్చి చంపి..అనంతరం శనివారం రాత్రి హోటల్ రూం నుండి పరారయ్యాడు. ఈ మొత్తం సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అతడ్ని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే అతడికి తుపాకీ ఎక్కడిదీ అని విచారిస్తున్నారు. ప్రియుడు రమ్మన్న చోటుకు వెళ్లడమే ఆమె ప్రాణాాల మీదకు తెచ్చుకుంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetholiganbetMeritking giriş