iDreamPost

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి!

ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. అయితే దానిని సాధించేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. విజయం సాధించే వాళ్లు కూడా బాగానే ఉంటారు.. అయితే అద్భుత విజయాలను సాధించే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారి జాబితాలో చేరింది ఓ గృహిణి.

ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. అయితే దానిని సాధించేది మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. విజయం సాధించే వాళ్లు కూడా బాగానే ఉంటారు.. అయితే అద్భుత విజయాలను సాధించే వారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వారి జాబితాలో చేరింది ఓ గృహిణి.

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గృహిణి!

ప్రభుత్వ ఉద్యోగం పొందాలనేది చాలా మంది యువతకు ఉండే బలమైన కోరిక. ఎంతో మంది సర్కార్ కొలువును సాధించేందుకు రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పుస్తకాల పురుగులుగా మారినా కూడా చాలా మందికి ఒక్క జాబ్ వచ్చే సరికే తల ప్రాణం తోకకొస్తుంది. ఎంతో మంది ఏళ్ల తరబడి పోరాడి.. చివరకు నిరాశతో లక్ష్యాన్ని వదిలేస్తుంటారు. అలా ఎంతో మంది ఒక్క ప్రభుత్వ  జాబ్ వచ్చిన చాలు అనుకుంటారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. ఓ మహిళ ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంతకీ ఆమె ఎవరు.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

విజయం కోసం పోరాడే వారిని సమాజం గుర్తించదు. విజేతగా నిలిచిన వారిని మాత్రమే గుర్తిస్తుంది. చాలా మంది విజయ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో వచ్చే అడ్డంకులకు భయపడి.. లక్ష్యాన్ని వదిలేస్తారు. కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొని విజయ శిఖరాలకు అధిరోహించి.. అందరికీ ఆదర్శంగా కనిపిస్తారు. అలాంటి వారిలో ఇంటిని నడిపించే గృహిణిలు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన పద్మ అనే మహిళ ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని శారద నగర్ లో ప్రాంతంలో పద్మ అనే మహిళ.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమెకు చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే కోరిక ఉండేది.

అందుకు తగినట్లే  ఉన్నత చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యారు. అలా చాలా కాలం సర్కార్ కొలువు కోసం పట్టు వదలకుండా శ్రమించారు. ఈ క్రమంలో పద్మ అనేక అవరోధాలను, సమస్యలను ఎదుర్కొన్నారు. చివరకు తన పట్టుదల, కృషి, కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటే.. ఆమెకు ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇలా పద్మ అనే మహిళా ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఒక వైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు ఇలా  ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. మొదట పీజీటీ ఉద్యోగం సాధించిన ఆమె ఇప్పటికే నియామక పత్రాలు పొందారు. తాజాగా జూనియర్ లెక్చరర్ ఫైనల్ లిస్టులోనూ ఎంపికయ్యానని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచినట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో ఈమెను పలువురు ప్రశంసిస్తున్నారు. మరి.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ మహిళకు మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి