iDreamPost

కోడలిపై అనుమానం.. దారుణంగా వ్యవహరించిన అత్తమామలు

కోడలిపై అనుమానం.. దారుణంగా వ్యవహరించిన అత్తమామలు

ఇంటి ఆడ పిల్లకు పెళ్లి చేశాక అత్తింటి వారు ఆమెను కోడలిగా కాకుండా కూతురిలా చూడాలని భావిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ మరో ఇంటి ఆడ పిల్ల.. మన ఇంటికి వచ్చే సరికి మాత్రం కోడలిగానే చూస్తుంటారు. ఇంట్లో తనే పెత్తనం చేయాలని, తన మాటే నెగ్గాలన్న పంతంతో కోడలిపై లేని పోని అభాండాలు వేస్తుంటోంది అత్త. ఏదైనా పని చేతకాకపోతే.. మీ అమ్మ ఏం నేర్పిందంటూ దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంటారు. ఆమెకంటూ స్వంత నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉండదు. ఇక పుట్టింటికి వెళ్లాలంటే అందరి పరిష్మన్ తీసుకోవాల్సిన దుస్థితి. ఇక కోడల్ని ఇంటి పని మనిషి కన్నా దారుణంగా చూసే అత్తలు ఇంకా ఉన్నారు ఈ సమాజంలో. అందుకు ఈ సంఘటనే ఓ ఉదాహరణ. కోడలని చూడకుండా అమానుష రీతిలో దాడి చేశారు. ఈ సంఘటన గత నెల 31న జరగ్గా.. వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్‌లో కోడలు తప్పు చేసిందన్న అనుమానంతో అత్తమామలు ఆమె పట్ల వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ సొంత జిల్లా హమీర్ పూర్‌లోని భోరంజ్ సబ్ డివిజన్‌లో ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజుల క్రితం ఆమె తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత అత్తమామలు.. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలు.. ఇంత కాలం ప్రియుడితో పరారైందని భావించిన అత్తింటి వారు.. కోడలి జుట్టును కత్తిరించి, నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగూల్మాన్ని తీసుకున్నారు పోలీసులు. అత్తమామలపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా స్థంభించాయని హిమాచల్ బీజెపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి