sai
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఎంతో బాధపెట్టిన ఆ విషయం గురించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌తో పాటు సూర్య భాయ్‌తో కూడా షేర్ చేసుకున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేదు. ఎంతో బాధపెట్టిన ఆ విషయం గురించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌తో పాటు సూర్య భాయ్‌తో కూడా షేర్ చేసుకున్నాడు.
sai
ఐపీఎల్-2024 ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో కనిపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. నీళ్లు తాగినంత అలవోకగా 200, 250 ప్లస్ స్కోర్లు బాదేస్తూ అపోజిషన్ టీమ్స్ వెన్నులో వణుకు పుట్టించింది. పవర్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు పోయించింది. భారీ విజయాలతో ఈసారి కప్పు తమదే అనే భరోసాను అభిమానుల్లో కలిగించింది. అయితే సెకండాఫ్‌లో కథ పూర్తిగా అడ్డం తిరిగింది. గెలవడమే మరిచిపోయినట్లు కనిపిస్తోంది కమిన్స్ సేన. మధ్యలో మిస్సైన మూమెంటమ్‌ను తిరిగి పట్టుకోవడంలో ఫెయిల్ అవుతోంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నిన్న ముంబై ఇండియన్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కమిన్స్ నిరాశలో కూరుకుపోయాడు.
ముంబై మీద ఓటమి కమిన్స్‌ను బాధించింది. అందుకే మ్యాచ్ తర్వాత డల్‌గా కనిపించాడు. అయితే ఓ పాత గాయం కూడా అతడ్ని వెంటాడుతున్నట్లు ఉంది. అందుకే దాని గురించి నిన్న మ్యాచ్ ముగిశాక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్‌తో షేర్ చేసుకున్నాడు. వీళ్ల మధ్య కన్వర్జేషన్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కమిన్స్‌కు చిన్నతనంలో ఓ ఇంజ్యురీ అయింది. బాల్యంలో తన సోదరితో కలసి ఆడుకుంటున్న సమయంలో అనూహ్యంగా కమిన్స్ కుడి చేతి మధ్య వేలికి గాయమైంది. అతడి సోదరి అనుకోకుండా ఇంటి తలుపును బలంగా నెట్టడంతో వేలికి ఇంజ్యురీ అయింది.
ఆ గాయం కారణంగా వేలి పైభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇది కమిన్స్‌ను బౌలర్ కాకుండా ఆపలేకపోయింది. మిగిలిన వేళ్ల సపోర్ట్‌తో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సాధారణంగా బౌలర్‌కు బంతి మీద గ్రిప్ చిక్కాలంటే మధ్య వేలుతోనే సాధ్యం. అలాంటిది గాయం కారణంగా ఆ వేలుతో ఇబ్బంది పడుతున్నా దాన్ని బయటపడకుండా ఆడుతూ పోతున్నాడు కమిన్స్. నిన్న మ్యాచ్ తర్వాత హార్దిక్, సూర్యతో సంభాషణలో ఇదే విషయాన్ని వాళ్లిద్దరితో పంచుకున్నాడు కమిన్స్. సోదరి తలుపు నెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఆర్హెచ్ సారథి చెప్పడంతో హార్దిక్ షాకయ్యాడు. అతడి రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాత గాయాన్ని కమిన్స్ మర్చిపోలేదని కామెంట్స్ చేస్తున్నారు.
Pat Cummins must be telling about how he lost the top of his middle finger on his dominant right hand when his sister accidentally slammed a door on it. Hardik’s reaction 😱 pic.twitter.com/oinHeW99mn
— 𝗔𝗱𝗶𝘁𝘆𝗔 (@StarkAditya_) May 7, 2024