iDreamPost

ఆ గ్రామంలో పెళ్లైన కొన్నాళ్లకే మగాళ్లు చనిపోతున్నారు.. ఏక్కడంటే?

India Widow Village

India Widow Village

ఆ గ్రామంలో పెళ్లైన కొన్నాళ్లకే మగాళ్లు చనిపోతున్నారు.. ఏక్కడంటే?

సాధారణంగా పెళ్లంటే ఒక మరుపురాని జ్ఞాపకం. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండూ నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం పెద్దల దీవెనలు పనిచేయవు.  అందుకే ఆ ఊరి ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలంటే మగాళ్లు భయపడే పరిస్థితి నెలకొంది.  అక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి.. ఆ గ్రామంలో జీవించడానికి  ధైర్యం చేయాలని అంటుంటారు. ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరుగుతుంది..? ఎందుకు ఆ గ్రామంలో మగాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడానికి భయడుతున్నారు? దీనికి వెనుక ఉన్న రహస్యం ఏంటీ? అన్న విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఆ గ్రామంలో ఎక్కడ చూసినా మహిళలు వితంతవులుగా కనిపిస్తారు. చిన్న వయసు అమ్మాయిలు కూడా వితంతువులుగా దర్శనమిస్తారు. ఇది ఏదో శాపగ్రస్త గ్రామం అని అనుకుంటే.. మీరు పొరపాటు పడినట్లే. ఈ గ్రామంలో పెళ్లైన కొన్నాళ్లకే పురుషులు చనిపోతుంటారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని బుధాపురా గ్రామాన్ని వితంతువు గ్రామం అని పిలుస్తుంటారు. ఈ గ్రామంలో నివసించే చాలా మంది మహిళలు నుదుటిన బొట్టు ఉండదు. చాలా మంది వితంతువులే కనిపిస్తుంటారు. పెళ్లైన కొన్నాళ్లకు భర్తలు చనిపోవడంతో చిన్న వయసు అమ్మాయిలు కూడా వితంతువులయ్యారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు గ్రామంలో అంతమంది మగాళ్లు ఎందుకు చనిపోతున్నారు అంటూ ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక్కడ పురుషులు చిన్న వయసులో చనిపోవడానికి బలమైన కారణం ఉందట. నివేదికల ప్రకారం.. ఇక్కడ పురుషులు సిలికోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ మరణిస్తున్నారని తెలిసింది. సిలికోసిస్ అనేది స్ఫటికాకార సిలికా ధూళి వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధి. ఈ గ్రామంలోని మగవారు చాలా వరకు గనుల్లో పనిచేస్తుంటారు. గనుల్లో పనిచేసే వారికి ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి వల్ల చిన్న వయసులోనే మగవాళ్లకు సరైన వైద్యం అందక చనిపోన్నారని వైద్యులు అంటున్నారు. భర్తలు చనిపోయిన మహిళలు తమ జీవనోపాధి కోసం అదే గనుల్లో పనిచేస్తూ పిల్లలను పోషించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టి మెరుగైన వైద్య సదుపాయ వసతి కల్పించాలని గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి