iDreamPost

Daggubati Venkatesh: ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్ ఎంట్రీ.. ఆ జిల్లాలో రోడ్ షో!

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షుకల గుండెల్లో ప్రత్యేక అభిమానం సంపాదించారు. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే వెంకీ.. తాజాగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షుకల గుండెల్లో ప్రత్యేక అభిమానం సంపాదించారు. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే వెంకీ.. తాజాగా ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.

Daggubati Venkatesh: ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్ ఎంట్రీ.. ఆ జిల్లాలో రోడ్ షో!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హీట్ ఓ రేంజ్ లో ఉంది. ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష కూటమి విజయం కోసం తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. అలానే తెలంగాణలో కూడా ఎన్నికల సమరం కొనసాగుతోంది. ఇక్కడ 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొనున్నారు. మరి.. ఏ జిల్లాలో , ఏ పార్టీ తరపున, ఎప్పుడు ప్రచారం చేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామ నాయుడి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వెంకటేశ్ ఎంట్రీ ఇచ్చారు. కలియుగ పాండవులు సినిమాతో తెలుగు చిత్ర సీమకు వెంకటేశ్ పరిచయం అయ్యారు. ఆ తరువాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి..టాప్ హీరోగా ఎదిగారు. అందుకే తన పేరుకు విజయాన్ని జోడించి విక్టరీ వెంకటేశ్ గా మారిపోయారు. ముఖ్యంగా వెంకటేష్ కు ఫ్యామిలీ మూవీలతో  మహిళలకు మరింత దగ్గరయ్యాడు.  అదే విధంగా ఇండస్ట్రీలో వెంకటేష్‌కు సౌమ్యుడిగా పేరుంది. ఎలాంటి వివాదాలు, కాంట్రవర్సీలు లేకుండా కెరీర్‌లో ఎదిగాడు. ముఖ్యంగా రాజకీయల్లో ఏ పార్టీకి ఆయన  మద్దతు తెలపలేదు. అలానే ఆయన ఎప్పుడూ రాజకీయ పార్టీలకు ప్రచారం చేయలేదు. అలాంటి వెంకీ.. ఈసారి మాత్రం ప్రచారానికి సిద్ధమయ్యారు. తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకటేశ్ ప్రచారానికి సిద్ధమయ్యారు.

మంగళవారం ఖమ్మంలో  వెంకటేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. తన వియ్యకుండూ రఘరాంరెడ్డి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వెంకటేష్ కుమార్తె ఆశ్రీతను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడికి ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇప్పటికే తన మామ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రఘురాం రెడ్డి కాంగ్రెస్ తరపున ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తన మామను గెలిపించాలని కోరుతూ వెంకటేశ్ కుమార్తె ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.

ఇదే సమయంలో వెంకటేశ్ కూడా వియ్యకుండి విజయం కోసం ఎన్నికల ప్రచారానికి ఎంట్రీ ఇస్తున్నారు. రఘురాం రెడ్డి చిన్న కుమారుడికి  రాష్ట్ర మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి  కుమార్తెను ఇచ్చారు. దీంతో హీరో  వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తమ వియ్యకుండి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. మొత్తం  17 స్థానాలకు ఒకే విడతలో పొలింగ్ జరగనుంది. మూడో విడతగా ఏపీతో పాటు తెలంగామలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి ఎవరు ఎక్కువ ఎంపీ స్థానాలు గెల్చుకుంటారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి