iDreamPost

OTT Movie: OTTలోకి బిగ్‌బాస్ బ్యూటీ సైకో కిల్ల‌ర్ మూవీ! ఒక్కో ట్విస్ట్ కి వణికిపోతారు!

  • Published May 07, 2024 | 2:57 PMUpdated May 07, 2024 | 2:57 PM

ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి.. ఈ క్రమంలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది.

ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి.. ఈ క్రమంలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమా ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది.

  • Published May 07, 2024 | 2:57 PMUpdated May 07, 2024 | 2:57 PM
OTT Movie: OTTలోకి బిగ్‌బాస్ బ్యూటీ సైకో కిల్ల‌ర్ మూవీ! ఒక్కో ట్విస్ట్ కి వణికిపోతారు!

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని.. ఎన్నో భాషల చిత్రాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కొన్ని థియేటర్ లో విడుదలైతే .. మరికొన్ని నేరుగా ఓటీటీ లోనే విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలు ఎలా వచ్చినా కూడా ప్రేక్షకులు మాత్రం వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరొక కొత్త సినిమా ఓటీటీ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతుంది. తమిళ సినిమా అయినా కూడా .. తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు… ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కాబోతుందనే విషయాలను చూసేద్దాం.

త‌మిళ బిగ్‌బాస్ ఫేమ్ స‌న‌మ్‌శెట్టి నటించిన సినిమా “పార్ధు”. ఈ సినిమాకు కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఏకలవ్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో మైఖేల్ తంగ‌దురై, స‌న‌మ్‌శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే తమిళ సినిమా ఓమై సెన్నై సినిమాకు తెలుగు డబ్ వెర్షన్ గా పార్ధు సినిమా.. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా 2021లో థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఓ మంచి సైకో థ్రిల్లర్ మూవీ గా ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్స్ కు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతుంది. ఈ సినిమా మే 9 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇక పార్ధు సినిమా కథ విషయానికొస్తే.. మైఖేల్ తంగ‌దురై ఈ సినిమాలో ఓ డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే, అతని బాస్ మాత్రం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో అందరిని బెదిరిస్తూ ఉంటాడు. అయితే, ఓ వ్యక్తి కారణంగా మొదలైన గొడవల వలన మైఖేల్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి. తన ప్రాణాలను నిలుపుకోడానికి ఓ వైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్ స్టార్స్ తో ఎలాంటి పోరాటం చేశాడు. ఈ పోరాటంలో అతనికి తోడుగా నిలిచింది ఎవరు.. అసలు చివరికి ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి