iDreamPost
android-app
ios-app

పర్సనల్ రికార్డుల గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author singhj Published - 11:16 AM, Thu - 12 October 23
  • Author singhj Published - 11:16 AM, Thu - 12 October 23
పర్సనల్ రికార్డుల గురించి రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా రెండో విజయంతో అదరగొట్టేసింది. ఆఫ్ఘానిస్థాన్​పై భారీ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో ముందుకు దూసుకెళ్లింది. దాయాది పాకిస్థాన్​తో మ్యాచ్​కు ముందు భారత్​కు చక్కటి ప్రాక్టీస్ లభించినట్లయింది. ఈ మ్యాచ్​లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131) భారీ సెంచరీతో తిరిగి ఫామ్​ను అందుకోగా.. విరాట్ కోహ్లీ (55) మరోమారు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మ్యాచ్ తర్వాత హిట్​మ్యాన్ కీలక విషయాలపై మాట్లాడాడు. ఆఫ్ఘాన్​పై విక్టరీతో పాటు నెక్స్ట్ దాయాది పాక్​తో మ్యాచ్​ పైనా స్పందించాడు.

‘ఢిల్లీ పిచ్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంది. నా న్యాచులర్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించా. క్రీజులో కుదురుకుంటే చాలు రన్స్ వస్తాయని అనిపించింది. చాన్నాళ్లుగా ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని వెయిట్ చేస్తున్నా. దీని కోసం ఎంతగానో శ్రమించా. వరల్డ్ కప్​లో సెంచరీ చేయడం స్పెషలే. కానీ ఇలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టిపెట్టను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. సెంచరీ గురించి మాట్లాడుతూ పర్సనల్ రికార్డుల కంటే టీమ్ గెలుపే ముఖ్యమని హిట్​మ్యాన్ పరోక్షంగా స్పష్టం చేశాడు. ఇలాంటివన్నీ లెక్కలు వేసుకోవడానికే బాగుంటాయని.. కానీ ఛేజింగ్ టైమ్​లో ఇలాంటి ఇన్నింగ్స్​లు ఆడటం తన బాధ్యత అని రోహిత్ పేర్కొన్నాడు. పాక్​తో మ్యాచ్​పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారత టీమ్​లో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారని.. అన్ని రకాల టాలెంట్స్ వారి సొంతమన్నాడు రోహిత్ శర్మ. భయమనేదే లేకుండా క్రికెట్ ఆడే ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని.. కాబట్టి, ఎవరితోనైనా పోరాడేందుకు తాము రెడీగా ఉంటామన్నాడు. బయటి నుంచి వచ్చే ఒత్తిడిని తమపై పడకుండా ముందుకు సాగుతామన్నాడు. పాకిస్థాన్​తో మ్యాచ్ తమకు కీలకమైనదేనని.. అయితే తమ చేతుల్లో ఉండే వాటి మీదే ఫోకస్ చేస్తామని హిట్​మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్​కు కాంబినేషన్ ఎలా ఉండనుంది? పిచ్ ఎలా మారుతుంది? అనే అంశాలను ఇప్పుడే తాను చెప్పలేనన్నాడు. తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్​ను బయటపెడతామని.. ఇదే తమ కర్తవ్యమన్నాడు రోహిత్. మరి.. పర్సనల్ రికార్డులు, పాక్​తో మ్యాచ్​పై రోహిత్ చేసిన వ్యాఖ్యల​ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆలయ నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చిన టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌!