iDreamPost

ఇన్ని రోగాలున్న బాబు 2024లో TDPని నడిపించగలడా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. 2024 లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీని బాబు నడపగలడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. 2024 లో ఏపీలో సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీని బాబు నడపగలడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్ని రోగాలున్న బాబు 2024లో TDPని నడిపించగలడా?

2024లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సమయం దగ్గర పడుతునే కొద్ది.. అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార పార్టీ వైఎస్సాఆర్ సీపీ మిగిలిన పార్టీల కంటే చాలా ముందుంది. మూడు ప్రాంతాల్లో ఒక్కేసారి సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించింది. ప్రభుత్వం  చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే ఇలా ప్రజలకు చేరువకావడంలో ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనుకబడి ఉన్నారు. ఆయన వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారంట. అలాంటి వ్యక్తి 2024 ఎన్నికలకు టీడీపీని నడిపించగలడా అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన సంగతి తెలిసిందే. ఆ తరువాత 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇటీవలే కంటి సమస్య కారణంతో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటి చికిత్స చేయించుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక కంటి సమస్యతో పాటు చర్మ సమస్య వ్యాధులతో చంద్రబాబు బాధపడుతున్నారు.

స్కిల్ స్కామ్ బెయిల్ పిటిషన్ విషయంలో ఆయన తరపు లాయర్లు కోర్టుకు కీలక విషయాలను తెలియజేశారు. చంద్రబాబుకి గుండె సమస్య ఉందని, అలాగే బరువు తగ్గారని, చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయంటూ పలు అనారోగ్య సమస్యలను కోర్టుకు వివరించారు. చంద్రబాబు తరచూ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలని వైద్యులు తెలిపారు. ఇన్ని రోగాలతో ఉన్న చంద్రబాబు  2024లో టీడీపీ నడిపించగలడా అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి.

వై ఏపీ నీడ్ జగన్ , సామాజిక సాధికార బస్సు యాత్ర, గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలతో వైఎస్సాఆర్ సీపీ ప్రజల్లోకి దూసుకెళ్తుంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేనాలు వెనబడే ఉన్నాయి. ఇంకా సీట్లు అంశం, ఉమ్మడి కార్యచరణ గురించి చర్చలు, సమావేశాలు నిర్వహించుకునే దగ్గరే ఉన్నారు. అంతేకాక ఈ పార్టీల కార్యక్రమాలు రచ్చ రచ్చగా మారుతున్నాయి. పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది క్లారిటీ లేదు.

ఒకవేళ సీట్లు ప్రకటించాక పరిస్థితులు ప్రతికూలంగా మారొచ్చు. వాటిని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారు అనేదే ఇక్కడ అందరిలో వస్తున్న సందేహం. ఇప్పటికే ఒకవైపు అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి సమయంలో పార్టీ ని సమర్ధవంతంగా నడపగలరా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్న బాబు టీడీపీ నడపగలారా అంటూ సోషల్ మీడీయాలో వస్తున్న సందేహాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి