ఇండియన్ హిస్టరీలో ఇస్రో మరో సువర్ణాధ్యాయం లిఖించింది. ఇదివరకు అగ్రదేశాలు ప్రయత్నించి విఫలమైన విషయాన్నీ.. భారతదేశం సాధించి. చూపించింది. ప్రస్తుతం ‘చంద్రయాన్ 3’ గురించి ఇండియాలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఎంతో గొప్పగా మాట్లాడుకుంటోంది. చంద్రయాన్ 3 సక్సెస్ తో.. చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా ఇండియా వరల్డ్ రికార్డులోకెక్కింది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 విజయంతో.. కోట్లాది భారతీయులను ఆనందంలో ముంచెత్తారు. ఆగష్టు 23న సాయంత్రం 6గంటల సమయంలో చంద్రయాన్ 3 సాధించిన ఘనత.. చరిత్రలో విజయఢంకా మోగించింది. అయితే.. ఈ విజయాన్ని ఇండియన్స్ ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
నాలుగేళ్ల క్రితం.. అంటే 2019లో విఫలమైన ఈ ప్రయోగం.. ఇస్రో సైంటిస్ట్ ల పట్టుదలతో సాకారం చేశారు. ఇప్పుడీ చంద్రయాన్ 3 సక్సెస్.. సినీ ఇండస్ట్రీలో సైతం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా ఇండియాలో ఎలాంటి అద్భుతాలు జరిగినా.. ఎవరు ఏం సాధించినా మన ఫిల్మ్ మేకర్స్ సినిమాలుగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్నో అద్భుత ఘట్టాలను చిత్రాలుగా ప్రేక్షకులకు అందించడం మనం చూశాం. స్పోర్ట్స్.. పొలిటికల్.. సైన్స్.. ఇలా అన్ని రంగాలకు సంబంధించి ఎన్నో విజయగాథలు సినిమాల రూపంలో గుర్తుండిపోయేలా చేశారు. ఇప్పుడు చంద్రయాన్ 3 విజయాన్ని సినిమాగా తీస్తారా? అనేది అసలు ప్రశ్న.
ప్రస్తుతం బాలీవుడ్ వర్గాలలో చంద్రయాన్ 3 గురించి చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇండియాలో బయోపిక్స్ అన్ని దాదాపు బాలీవుడ్ లోనే తెరకెక్కుతుంటాయి. ఇలాంటి విజయాలను సినిమాలుగా తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పటివరకు మిషన్ మంగళ్, ఎయిర్ లిఫ్ట్, కేసరి, ప్యాడ్ మ్యాన్, టాయిలెట్, సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటివి అక్షయ్ కుమార్ హీరోగా తెరపైకి వచ్చాయి. వాటి జయాపజయాల గురించి పక్కన పెడితే.. సినిమాలుగా ఎప్పటికీ ఆ గొప్ప కథలను గుర్తు చేస్తుంటాయి. ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 సక్సెస్ స్టోరీ.. స్క్రిప్ట్ గా మలిచి తెరరూపం ఇస్తారేమో చూడాలని టాక్ నడుస్తోంది. త్వరలో దీనిపై ఏదొక అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు. మరి చంద్రయాన్ 3 సక్సెస్ సినిమాగా వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.