iDreamPost
android-app
ios-app

రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసిన శాడిస్ట్ భార్య!

రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని కోసిన శాడిస్ట్ భార్య!

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ శాడిస్ట్ భార్య తన భర్త మర్మాంగాన్ని బ్లేడ్ తో కోసింది. దీంతో బాధితుడు గట్టిగా అరుపులు వేయడంతో స్థానికులు పరుగు పరుగున వచ్చి చూడగా అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇక వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వెద్యులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ మహిళ భర్త మర్మాంగాన్ని ఎందుకు కోసింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఆనంద్ అనే వ్యక్తి గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతులు సంసారం చేశారో లేదో.. కొన్నాళ్లకే గుడ్ బై చెప్పుకుని విడిపోయారు. దీంతో ఐదేళ్ల కిందట ఆనంద్ వరమ్మ అనే మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. అలా పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చిది. ఇదిలా ఉంటే.. ఆనంద్ తాజాగా ఇంట్లో తన మొదటి భార్య చేసిన రీల్స్ చేస్తూ కూర్చున్నాడు.

అదే సమయానికి అతని రెండవ భార్య వచ్చింది. ఎందుకు నీ మొదటి భార్య రీల్స్ చూస్తున్నావని భర్తను గట్టిగా ప్రశ్నించింది. ఇక ఇదే విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన శాడిస్ట్ భార్య వరమ్మ.. ఇంట్లో ఉన్న బ్లేడ్ తో భర్త ఆనంద్ మర్మాంగాలను కోసింది. ఇక వెంటనే స్పందించిన స్థానికులు ఆనంద్ ను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను కోసేసిన భార్య కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş