iDreamPost
android-app
ios-app

భర్త విధులకు వెళ్లగా.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. ఆ తర్వాత..

  • Published Jan 14, 2024 | 11:38 AM Updated Updated Jan 14, 2024 | 11:38 AM

ఇటీవల అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. వారి సరసాలకు అడ్డుగా ఉన్నారని కన్న పిల్లలను, కట్టుకున్న భర్తలను సైతం అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు.

ఇటీవల అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. వారి సరసాలకు అడ్డుగా ఉన్నారని కన్న పిల్లలను, కట్టుకున్న భర్తలను సైతం అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు.

భర్త విధులకు వెళ్లగా.. ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. ఆ తర్వాత..

ప్రస్తుత రోజుల్లో పరాయి వ్యక్తులపై వ్యామోహంతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. శారీరక సుఖాల కోసం విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో మూడో వ్యక్తి ఎంటర్ అవడంతో కుటుంబాలు నాశనమవుతున్నాయి. ఇటీవల అక్రమ సంబంధాలకు సంబంధించిన ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి. వారి సరసాలకు అడ్డుగా ఉన్నారని కన్న పిల్లలను, కట్టుకున్న భర్తలను సైతం అంతమొందించడానికి కూడా వెనకాడడం లేదు. ఇదే రీతిలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. అక్రమ సంబంధం గుట్టు రట్టు కావడంతో భర్తను హత్య చేసింది. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

భర్త కుటుంబ పోషణకు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు డ్యూటీకి వెళ్లగా తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అయితే విధులకు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి పడక గదిలో భార్య ప్రియుడితో కలిసి ఉండడం చూసి షాక్ అయ్యాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యా ఆమె ప్రియుడిపై దాడికి ప్రయత్నించగా ఇద్దరు కలిసి అతడిని అంతమొందించారు. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరిచే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. భార్య ఆమె ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు నిర్ధరించారు. అసలు ఏం జరిగిందంటే?

ఏపీలోని పుట్టపర్తి తాలూకాకి చెందిన నందిని బాయి, భర్త వెంకటరమణ నాయక్‌ (30) హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో నివాసం ఉండేవారు. వెంకటరమణ సెక్యూరిటి గార్డుగా పనులు చేస్తూ జీవిస్తున్నారు. ఇదే సమయంలో భార్య నందినిబాయి తమ గ్రామానికే చెందిన నితీష్ కుమార్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రియుడు నితీశ్‌ కుమార్‌ను తరచూ ఇంటికి పిలిపించుకునేది నందినిబాయి. ఈ నెల 6వ తేదీన భర్త వెంకటరమణ విధులకు వెళ్లగా, నందినిబాయి ప్రియున్ని ఇంటికి పిలిపించింది. ఈ క్రమంలో విధులకు వెళ్లిన భర్త కొంతసేపటికే ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ సమయంలో భార్య, ప్రియుడు పడకగదిలో ఉండడం చూసి వెంకటరమణ ఆగ్రహంతో గొడవకు దిగాడు.

గొడవ పడుతుండగా భార్య ఆమె ప్రియుడు భర్త వెంకట రమణ నాయక్ పై దాడి చేసి హత్య చేశారు. మృత దేహాన్ని టాయిలెట్లో పడేశారు. తరువాత పోలీసులకు ఫోన్‌చేసి తన భర్త గుండెపోటుతో మరణించాడని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేసి గుండెపోటు కాదని, హత్య అనే అనుమానం ఉందని తెలిపారు. దీంతో పోలీసులు నందినిబాయిని అదుపులోకి తీసుకుని విచారణచే పట్టగా పోలీసుల ముందు ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరి భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbet