iDreamPost
android-app
ios-app

గుడివాడలో కొడాలి నానిని గట్టిగా ఢీకొట్టేది ఎవరు?

గుడివాడలో కొడాలి నానిని గట్టిగా ఢీకొట్టేది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రత్యేక గుర్తింపుంది. అందులోనూ గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ నుంచే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పోటీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఇది టీడీపీ కంచుకోట. అలాంటి గుడివాడను వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక టీడీపీ వారికి కొరకరాని కొయ్యాగా మారిని వైసీపీ నేతల్లో మొదటి వ్యక్తిగా కొడాలి నాని ఉన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, కొడుకు లోకేశ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతారు కొడాలి నాని. అందుకే ఈసారి ఎలాగైన కొడాలి నాని ఓడించాలని టీడీపీ భావిస్తుంది. అయితే ఆయనను ఢీ కొట్టేది ఎవరు అంటే మాత్రం.. సమాధానం దొరకడం లేదని పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

కొడాలి నాని.. రాజకీయాలపై  అవగాహాన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కొడాలి నాని.. నందమూరి హరికృష్ణ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2004లో గుడివాడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఆ తరువాత 2009, 2014, 2019లో ఎమ్మెల్యేగా నాని గెలిచారు. రెండు సార్లు టీడీపీ నుంచి, రెండు సార్లు వైసీపీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా కొడాలి నాని ఉన్నారు. అంతేకాక అవకాశం వచ్చిన ప్రతిసారీ చంద్రబాబును, నారా లోకేశ్ పై తీవ్ర స్థాయిలో నాని విరుచుకు పడుతున్నారు. ఇదే టీడీపీ కేడర్ రుచించడం లేదు.

అందుకే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ జెండా ఎగరాలనుకుంటుంది ఆ పార్టీ కేడర్. అదే టీడీపీ పార్టీ కూడా పెద్ద టాస్క్. టీడీపీ అధిష్టానం కూడా కొడాలి నాని ఓడించాలనే ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థిను బరిలో దించుతారని టీడీపీ తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు. అయితే ఇలా ఎదురు చూడటంలోనే రోజులు గడిచిపోతున్నాయి. అధిష్టానం నుంచి  ఉలుకుపలుకులేదు. గత ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన  దేవినేని అవినాష్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు ఉన్నా, మరికొందరు నాయకులు హడావుడి చేస్తున్నా .. వారే అభ్యర్థులని పార్టీ ప్రకటించలేదు. నానిని ఢీకొట్టాలంటే.. ఆయన కంటే బలమైన నాయకుడు కావాలని.. వెతకడంలోనే కాలం గడిచిపోతుందనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

ఇదే అధికార పక్షానికి ఫల్ జోష్ నింపేలా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. అలానే గుడివాడ ప్రజల్లో నానికి మంచి పేరు ఉంది. నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ అక్కడ తిరుగులేని నాయకుడిగా కొడాలి నాని ఉన్నారు. టీడీపీ అభ్యర్థిని ఖరారు చేస్తే వాళ్లు పనిచేసుకుంటూ గట్టిగా పోటీ ఇస్తారు కానీ టీడీపీ అధిష్టానం ఆ అవకాశం ఇవ్వడం ఎలక్షన్ కి ఒక్క నెల ఉంది అన్న వరకు అభ్యర్థిని ఖరారు చెయ్యడని, చివర్లో అభ్యర్థిని ప్రకటించి.. చివరకు కొడాలి నానినే  గెలుస్తారని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆ విధంగా కొడాలి నానిని టీడీపీ గెలిపిస్తుందని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది. మరి… సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి