iDreamPost

ది గ్రే మ్యాన్, పరంపర సీజన్ 2, ఇండియన్ ప్రిడేటర్: ఈ వారం OTTలో ఏం చూడాలి?

ది గ్రే మ్యాన్, పరంపర సీజన్ 2, ఇండియన్ ప్రిడేటర్: ఈ వారం OTTలో ఏం చూడాలి?

ఈ వారం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో, కొన్ని ఎగ్జైటింగ్ సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ర్యాన్ గోస్లింగ్ , ధనుష్ నటించిన ది గ్రే మ్యాన్ నుంచి, ఇండియన్ ప్రిడేటర్ వరకు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఈ వీకెండ్ లో వాచ్ చేయ‌డానికి ఏం సినిమాలు, సీరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయంటే..!

ఇండియన్ ప్రిడేటర్: బుచర్ ఆఫ్ ఢిల్లీ : నెట్‌ఫ్లిక్స్

(Indian Predator: Butcher of Delhi : Netflix)
విడుదల తేదీ: జూలై 20

ఆయేషా సూద్ దర్శకత్వం వహించిన డాక్యుసీరీల మీద సోషల్ మీడియాలో చాలా చ‌ర్చ న‌డుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో వ‌ల‌వేసి ప‌ట్టుకొని, వాళ్ల‌ను ముక్కలు చేసి శరీర భాగాలను చెల్లాచెదురు చేసిన ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ జీవితాన్ని, ఈ సీరీస్ చూపిస్తున్నాయి. 1998 – 2007 మధ్య పశ్చిమ ఢిల్లీలో మొత్తం ఏడుగురిని చంపినట్లు భావిస్తున్నారు. మొదటి హత్య 1998లో జరిగింది.


పరంపర సీజన్ 2: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

(Parampara season 2: Disney plus Hotstar)
విడుదల తేదీ: జూలై 21

తెలుగు ఒరిజినల్ సిరీస్ క్రైమ్ డ్రామా, ఇందులో అందరికీ తెలిసిన జగపతి బాబు , శరత్ కుమార్ నటించారు. ఒక కుటుంబంలో పవర్ డైనమిక్స్ చుట్టూ తిరిగే మొదటి సీజన్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కొట్టేసింది. హరి యెల్లేటి ఈ సీరీస్ కి రైట‌ర్. కృష్ణ విజయ్ ఎల్ , విశ్వనాథ్ అరిగెల డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సీరీస్ లో నవీన్ చంద్ర, ఇషాన్ , ఆకాంక్ష సింగ్ కూడా కీల‌క పాత్ర‌ల్లో ఉన్నారు.

జురాసిక్ వరల్డ్ క్యాంప్ క్రెటేషియస్ సీజన్ 5: నెట్‌ఫ్లిక్స్
(Jurassic World Camp Cretaceous Season 5: Netflix)
విడుదల తేదీ: జూలై 21

ఇస్లా నుబ్లార్‌లోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ కేంప్ కి ఆహ్వానించబడిన ఆరుగురు యువకుల చుట్టూ యానిమేటెడ్ సిరీస్ తిరుగుతుంది. రాబోయే సీజన్‌లో, డైనోసార్‌లు త‌ప్పించుకున్న‌ప్పుడు వాళ్లు ఒక‌రు నొక‌రు ర‌క్షించుకోవాలంటే టీం వ‌ర్క్ చేయాలి.

ది గ్రే మ్యాన్: నెట్‌ఫ్లిక్స్
(The Gray Man: Netflix)
విడుదల తేదీ: జూలై 22

రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో, ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling), ధనుష్(Dhanush) ఉన్నారు. ఇది CIA కిరాయి గూఢచారి సియెర్రా సిక్స్ చుట్టూ క‌థ‌ తిరుగుతుంది, అతను అనుకోకుండా చీకటి ఏజెన్సీ రహస్యాలను వెలికితీస్తాడు. అంతే అత‌ని తోటి మాజీ ఏజెంట్స్, ఇత‌ర అంతర్జాతీయ హంత‌కుల‌కు టార్గెట్ అవుతాడు. ఇదో హైలోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా. అందులో ధ‌నుష్ స్టైలిష్ యాక్టింగ్ ను చూసితీరాలి.

డాక్టర్ అరోరా – గుప్త రోగ్ విశేషజ్ఞ : SonyLIV
(Dr Arora – Gupt Rog Visheshagya : SonyLIV)
విడుదల తేదీ: జూలై 22

ఇంతియాజ్ అలీ రూపొందించిన ఈ సిరీస్ ను కుముద్ మిశ్రా రాశారు. ఈ సీరీస్ ఒక సెక్సాలజిస్ట్ జీవితం చుట్టూ తిరుగుతుంది. అతనికి వ‌చ్చే కేసులు, లైంగిక సంబంధాల చుట్టూ ఉన్న అనుమానాల గురించి చెబుతుంది.

ఇన్ ది సూప్ – ఫ్రెండ్‌కేషన్: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
(In the Soop – Friendcation: Disney plus Hotstar_
విడుదల తేదీ: జూలై 22

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి