Nidhan
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు జట్టుకు వరుస విజయాలు, ఐసీసీ ట్రోఫీలు అందిస్తూ దూసుకెళ్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు బంతితో మ్యాజిక్ చేశాడు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు ఏది పట్టుకున్నా బంగారం అయిపోతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు జట్టుకు వరుస విజయాలు, ఐసీసీ ట్రోఫీలు అందిస్తూ దూసుకెళ్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు బంతితో మ్యాజిక్ చేశాడు.
Nidhan
ఎవరికైనా ఏదైనా కలిసొస్తే, చేసే ప్రతి పని సక్సెస్ అయితే, మంచి పేరు తెచ్చుకుంటే నక్క తోక తొక్కాడంటారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా నక్క తోక తొక్కినట్లే ఉన్నాడు. 2023 అతడి కెరీర్లో గోల్డెన్ ఇయర్‌గా నిలిచింది. గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్‌ల్లో కంగారూలను విజేతగా నిలిపాడు కమిన్స్. ఒక క్రికెటర్‌గా సాధించాల్సిన చాలా ఘనతల్ని ఒకే ఏడాది అందుకోవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు కమిన్స్. అద్భుతమైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్న కమిన్స్.. కెప్టెన్‌గా పర్ఫెక్ట్ డెసిజన్స్ తీసుకుంటూ టీమ్‌కు విక్టరీలు అందిస్తున్నాడు. బౌలింగే కాదు.. అవసరాన్ని బట్టి బ్యాట్‌తోనూ విలువైన రన్స్ చేస్తూ ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. అలాంటి కమిన్స్ మరోమారు తన సత్తా చాటాడు. రెండేళ్ల వ్యవధిలో ఒకే సీన్‌ను రిపీట్ చేశాడు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కంగారూ కెప్టెన్ కమిన్స్ చెలరేగిపోయాడు. బంతితో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. అన్‌స్టాపబుల్ రేంజ్లో చెలరేగి ప్రత్యర్థులను హడలెత్తించాడు. కమిన్స్ (4/41)తో పాటు జోష్ హేజల్‌వుడ్ (4/44) కూడా అగ్నికి ఆయువులా తోడవడంతో వెస్టిండీస్ 188 పరుగులకే కుప్పకూలింది. నిప్పులు చెరిగే వేగంతో, స్వింగ్ చేస్తూ వీళ్లు వేసిన డెలివరీస్కు ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోయారు. ముఖ్యంగా కమిన్స్ లైన్ అండ్ లెంగ్త్‌ను పట్టుకొని బౌలింగ్ చేయడంతో విండీస్ బ్యాట్స్‌మెన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (13), టి చందర్‌పాల్ (6)తో పాటు కీపర్ జోష్వా డసిల్వా (6), అల్జారీ జోసెఫ్ (14)ను కమిన్స్ వెనక్కి పంపాడు. అయితే వీటిల్లో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి.
కమిన్స్ ఆఫ్ స్టంప్‌కు బయట విసిరిన బంతి కాస్త స్వింగ్ అయి వికెట్ల మీదకు దూసుకొచ్చింది. దాన్ని డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించాడు బ్రాత్‌వైట్. కానీ బాల్ అతడి బ్యాట్‌ను మిస్సై ఆఫ్ స్టంప్‌ను ముద్దాడింది. సరిగ్గా ఆఫ్ స్టంప్ కొసను గిరాటేసింది. దీంతో బ్రాత్‌వైట్ నిరాశతో క్రీజును వీడాడు. అయితే అతడు కమిన్స్ బౌలింగ్‌లో రెండేళ్ల కింద ఇలాగే ఔటవ్వడం గమనార్హం. డిసెంబర్ 2, 2022న జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కమిన్స్ వేసిన బాల్ బ్రాత్‌వైట్ టాప్ ఆఫ్ ఆఫ్ స్టంప్‌ను తాకింది. ఇప్పుడు కూడా అదే రీతిలో ప్లాన్ చేసి మరీ అతడి వీక్నెస్ మీద దెబ్బకొట్టాడు కంగారూ కెప్టెన్. ఇన్‌స్వింగ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడటాన్ని క్యాష్ చేసుకొని బ్రాత్‌వైట్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అప్పటి వీడియోతో పాటు ఇప్పటి డిస్మిసల్‌ను కూడా కలిపి తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కమిన్స్ బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఆసీస్ కెప్టెన్‌ను మెచ్చుకుంటున్నారు. అతడు మరో మెక్‌గ్రాత్‌లా కనిపిస్తున్నాడని చెబుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్, వికెట్లను టార్గెట్ చేస్తూ బౌలింగ్ వేయడం మెక్‌గ్రాత్ బలాలని.. కమిన్స్ కూడా అదే శైలిని ఫాలో అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కమిన్స్ లాంటి బౌలర్ ఒక్కడు ఉన్నా టీమ్‌కు ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే సరికి 21 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. విండీస్ స్కోరుకు ఆస్ట్రేలియా ఇంకా 129 పరుగుల దూరంలో ఉంది. మరి.. కమిన్స్ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Yuvraj Singh: ఆశిష్ నెహ్రా మోసం చేశాడు.. యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
Nobody hits the top of off-stump quite like Pat Cummins!
For the second summer in a row, he knocked back Kraigg Brathwaite’s with absolute precision 👌 #AUSvWI pic.twitter.com/RVq9Jashg3
— cricket.com.au (@cricketcomau) January 17, 2024