iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: ఆశిష్ నెహ్రా మోసం చేశాడు.. యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

  • Published Jan 16, 2024 | 9:12 PM Updated Updated Jan 17, 2024 | 5:54 PM

టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తన విషయంలో ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్.

టీమిండియా మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా తన విషయంలో ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్.

Yuvraj Singh: ఆశిష్ నెహ్రా మోసం చేశాడు.. యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే కాక ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అచ్చమైన ఆల్ రౌండర్ గా తన బ్యాటింగ్, బౌలింగ్ తో 2011 వరల్డ్ కప్ ను భారత్ కు అందించాడు. దీంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని లీగుల్లో మాత్రమే దర్శనమిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇదిలా ఉండగా.. త్వరలోనే టీమిండియా కోచ్ గా యువరాజ్ కొత్త అవతారంలో కనిపిస్తాడన్న వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ 2024 సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అదేంటి? అతడు రిటైర్మెంట్ ప్రకటించాడుగా మళ్లీ ఈ మెగాటోర్నీలోకి అడుగుపెట్టాడం ఏంటి? అన్న డౌట్ మీకు రావొచ్చు. అయితే అతడు రాబోయేది ప్లేయర్ గా కాదు.. కోచ్ లేదా మెంటర్ పాత్రలో. ఇందుకోసం యువీ తెరవెనక ప్రయత్నాలు కూడా చేశాడని సమాచారం. అందులో భాగంగా గుజరాత్ టైటాన్స్ జట్టులో ఏదైనా ఉద్యోగం ఉందా? అని నెహ్రాను అడిగాడట. దానికి నెహ్రా ఎలాంటి ఉద్యోగం ఖాళీ లేదు అని చెప్పాడట. అందువల్ల ఐపీఎల్ లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం కుదరలేదని యువీ చెప్పుకొచ్చాడు. దీంతో అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని చెప్పకనే చెప్పాడు.

ఒక విధంగా నన్ను నెహ్రా మోసం చేశాడని యువీ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం నా తొలి ప్రాధాన్యత నా పిల్లలే అని, వారు స్కూల్ కు వెళ్లడం ప్రారంభించినప్పుడు నాకు సమయం ఉంటుంది. దాంతో క్రికెట్ లోకి రావాలనుకుంటున్నానని యువరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే నా రాష్ట్రానికి చెందిన యువ క్రికెటర్లతో కలిసి పని చేయడం, వారికి మార్గనిర్దేశం చేసి.. వారిని తీర్చిదిద్దడం నా ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. గతంలో టీమిండియాలో కలిసి పనిచేసిన అనుబంధం కారణంగానే నెహ్రాను ఉద్యోగం అడిగాడు యువరాజ్. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు యువీ. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.