iDreamPost
android-app
ios-app

OTT Release: వీకెండ్‌ స్పెషల్‌.. OTTలోకి వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. అస్సలు మిస్‌ కావొద్దు

  • Published Apr 26, 2024 | 7:54 AM Updated Updated Apr 26, 2024 | 7:54 AM

వీకెండ్‌ వచ్చేసింది.. కొత్త సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారికి పండగే. ఇక ఈ వారం మూడు క్రేజీ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు చూడండి

వీకెండ్‌ వచ్చేసింది.. కొత్త సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారికి పండగే. ఇక ఈ వారం మూడు క్రేజీ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు చూడండి

  • Published Apr 26, 2024 | 7:54 AMUpdated Apr 26, 2024 | 7:54 AM
OTT Release: వీకెండ్‌ స్పెషల్‌.. OTTలోకి వచ్చేసిన 3 క్రేజీ సినిమాలు.. అస్సలు మిస్‌ కావొద్దు

ఒకప్పుడు వీకేండ్‌ అంటే కొత్త సినిమాల విడుదల కోసం ఆత్రుతతగా ఎదురు చూసేవారు. మరి ఇప్పుడో ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాల కన్నా.. ఓటీటీలో విడుదల కాబోయే కొత్త సినిమాల కోసం ఆత్రుతగా ఎదురు చూసేవారు సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేడు వీకెండ్‌ శుక్రవారం వచ్చింది. మరి ఈ రోజు ఓటీటీల్లోకి వచ్చే కొత్త సినిమాలు ఏవి.. వాటిల్లో దేనిపై ప్రేక్షకులకు ఆసక్తి ఉంది అనే వివరాలు మీ కోసం..

ఇక ఈ వీక్‌ ఓటీటీల్లోకి చాలా సినిమాలు వచ్చేశాయి. కాకపోతే వాటిలో ఓ మూడు సినిమాల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటిలో రెండు తెలుగు చిత్రాలు కాగా.. ఒకటి హిందీ సినిమా.. నేడు అనగా శుక్రవారం నాడు ఈ సినిమాలు అన్ని స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోతున్నాయి. ఓటీటీల్లో వచ్చే సినిమాలు అంటే కొందరు ప్రేక్షకులు ఏమో రిలీజ్‌ అయిన వెంటనే చూస్తారు.. కానీ కొందరు మాత్రం వీకెండ్‌లో ఈ మూవీలను చూసేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. మరి ఇంతకు ఆ క్రేజీ సినిమాలు ఏవి.. అవి ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి అంటే..

‘డీజే టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ.. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ తీశాడు. చాలాసార్లు వాయిదా పడి మార్చి 29న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ఈ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక థియేటర్లలో భారీ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ వీకెండ్‌లో మంచి రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ చూద్దామనుకునే వారికి టిల్లు స్క్వేర్‌ బెస్ట్ ఆప్షన్.

అలానే ఈ వీకెండ్‌ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మరో సినిమా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’. ఇక గత కొన్నేళ్లుగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న విజయ్‌ ఫ్యామిలీ స్టార్‌ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కోసమైతే ఈ వీకెండ్‌లో మూవీ చూడొచ్చు.

ఆమిర్ ఖాన్ నిర్మాతగా, అతడి మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘లా పతా లేడీస్’. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, తన భార్య మిస్ కావడంతో మరో అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఇది కూడా మంచి కామెడీ చిత్రమే. ఈ వీకెండ్ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్ కావాలంటే ఈ సినిమా మీకు బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో కామెంట్స్‌ చేయండి.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet