iDreamPost

మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? షాకింగ్ న్యూస్ ఏంటంటే?

మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? షాకింగ్ న్యూస్ ఏంటంటే?

ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వ్యవసాయం చేసే రైతుల నుంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వరకు ఇలా ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక ఎలాంటి సమాచారం కావాలన్న వెంటనే గూగుల్ క్రోమ్ లో సెర్చ్ చేయడం, కావాల్సిన సమాచారాన్ని పొందడం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ యూజర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. అసలు విషయం ఏంటంటే?

కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ ల వినియోగం మరింత ఎక్కువైంది. అప్పట్లో స్కూల్స్ అన్ని మూత పడడంతో విద్యార్థులు అంతా ఆన్ లైన్ క్లాస్ లు వింటూ చదువుకున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ క్రోమ్ సెర్చ్ చేస్తూ కావాల్సిన సమాచారాన్ని పొందు పరుచుకున్నారు. ఇలా ప్రతీ ఒక్కరు గూగుల్ క్రోమ్ సెర్చ్ చేయడం అనేది అలవాటుగా మారింది. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు హ్యాకర్స్ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. ఎవరైతే పాత వెర్షన్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారో వారు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. అందులో కొన్ని లోపాలు ఉన్నాయని, దీని కారణంగానే హ్యాకర్లు దాడి చేసే అవకాశం లేకపోలేదని భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ తెలిపింది. ఇక ఇందులో భాగంగానే టైప్ కన్ఫ్యూజన్ ఎర్రర్, వెబ్ ఆర్టీపీ అండ్ గెస్ట్ వ్యూ, వెబ్ ట్రాన్స్ పోర్ట్ తదితర లోపాలను క్రోమ్ పాత వెర్షన్‌లో గుర్తించామని తెలియజేసింది. దీంతో వెంటనే పాత వెర్షన్ గూగుల్ క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి