iDreamPost

జంప్ జిలానీలకు షాకిచ్చిన ఓటర్లు.. ఏకంగా 9 మంది నేతలకు వాతలు!

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారికి ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఓటర్లు గట్టి షాకు ఇచ్చారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అలా వెళ్లిన వారికి ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఓటర్లు గట్టి షాకు ఇచ్చారు.

జంప్ జిలానీలకు షాకిచ్చిన ఓటర్లు.. ఏకంగా 9 మంది నేతలకు వాతలు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వస్తోంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అంతా సమీప ప్రత్యర్థులపై భారీ ఓట్ల మెజారిటీలో విజయఢంకా మోగించారు. ఇదిలా ఉంటే.. 2018లో కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలకు ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లకు గట్టిగానే షాకిచ్చారు. వారిని ఓడించి జంప్ జిలానీలకు వాతలు పెడుతూ తీర్పును ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అప్పట్లో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకూడదని సొంత పార్టీ నేతలు ఎంతో మొత్తుకున్నారు. కానీ, ఇవేం పట్టించుకోని ఆ నేతలంతా కారు హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లారు.

అలా వెళ్లినవారిలో.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే, పైలట్ రోహత్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపెందర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్, కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, నకిరికేల్ లో చిరుమూర్తి లింగయ్య, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, పీనపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వంటి నేతలు ఉన్నారు. అయితే, ఈ నేతలు అందరినీ తెలంగాణ ఓటర్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది జంప్ జిలానీల్లో 9 నేతలకు ఓటర్లు షాకిస్తూ ఒడగొట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తప్పా.. మిగతా 9 మంది లీడర్లును తెలంగాణ ప్రజలు ఒడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి