iDreamPost

మూడేళ్లుగా గన్‌తో బెదిరించి మహిళపై అత్యాచారం.. ఎంపీ క్వార్టర్స్‌లోనే అఘాయిత్యం

జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటంతో పాటు.. వాటిని వీడియోలు తీసి బెదిరించేవాడు. తాజాగా ఓ మహిళా తీవ్రమైన ఆరోపణలు చేసింది.

జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు మహిళలపై అత్యాచారాలకు పాల్పడటంతో పాటు.. వాటిని వీడియోలు తీసి బెదిరించేవాడు. తాజాగా ఓ మహిళా తీవ్రమైన ఆరోపణలు చేసింది.

మూడేళ్లుగా గన్‌తో బెదిరించి మహిళపై అత్యాచారం.. ఎంపీ క్వార్టర్స్‌లోనే అఘాయిత్యం

ప్రజలతో, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి.. అదే ప్రజా పాలనలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వార్తల్లో నిలిచాడు. సెక్సువల్ హెర్రాస్ మెంట్, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై జనతాదళ్ సెక్యూలర్ హాసన్ సిట్టింగ్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి విదితమే. ప్రజల్వ్ పలువురు మహిళలపై లైంగికంగా వేధిస్తున్నట్లు పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌పై పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ లైంగిక ఆరోపణలపై కర్ణాటక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హాసన్‌కు చెందిన సొంత పార్టీ మహిళా కార్యకర్తే ప్రజ్వల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదుతో మే 1న బెంగళూరులో అతడిపై అత్యాచార కేసు నమోదైంది. 44 ఏళ్ల మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదులో.. ప్రజల్వ్ తనను మూడేళ్లుగా బలవంతంగా, తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడని పేర్కొంది. తనకు సహకరించకుంటే తన భర్తను చంపేస్తానని భయపెట్టాడని, అలాగే ఫోనులో తనతో ఎంపీ గడిపిన సమయంలో వీడియోలు తీసి, వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నాడని తెలిపింది. 2021 జనవరి 1 నుండి 2024 ఏప్రిల్ 25 వరకు పలుమార్లు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపింది. కొంత మంది మహిళా విద్యార్థులకు హాస్టల్లో సీట్లు ఇప్పించే విషయమై 2021లో హాసన్ ఎంపీని ప్రజ్వల్‌ను తొలిసారిగా కలిసినట్లు పేర్కొంది బాధిత మహిళ.

‘ఫస్ట్ టైం ప్రజ్వల్ని కలిసేందుకు వెళ్లినప్పుడు అతడు నన్ను కలవలేదు. మరుసటి రోజు రమ్మని తిరిగి పంపించేశారు. చెప్పిన ప్రకరామే.. మరుసటి రోజు హాసన్ పట్టణంలోని ఎంపీ క్వార్టర్స్‌కి వెళ్లే సరికి అక్కడ కోలాహలం నెలకొంది. మహిళలు ఉన్న మొదటి అంతస్తులో నన్ను వేచి ఉండమని అతడి సిబ్బంది చెప్పారు.ప్రజల్వ్ అందరితో మాట్టాడారు. ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. చివరిగా నేను ఒక్కదాన్నే మిగిలాను. నన్ను తన గదికి పిలిచాడు. నేను లోపలికి వెళ్లాను. అతను తాళం వేశాడు. అనంతరం తన తల్లి భవానీ రేవణ్ణకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడానికి నా భర్తే కారణమని, అతడ్ని అదుపులోకి పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అనంతరం దుస్తులు విప్పమన్నాడు. నేను ప్రతిఘటించే సరికి.. తుపాకీతో బెదిరించి.. నా చేత బలవంతంగా దుస్తులు విప్పించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ మొత్తం దృశ్యాన్ని తన ఫోనులో వీడియో తీశాడు.

లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అందులో నీ మొహం మాత్రమే కనిపిస్తుందని, నా ఫేస్ కనిపించడం లేదని చెప్పాడు. అతడు ఎప్పుడు ఫోన్ చేస్తే.. అప్పుడు అతడితో గడపాల్సిందే. అలాగే వీడియో కాల్స్ చేసి క్లాత్స్ విప్పేయాలని బలవంతం చేసేవాడు.’ అని పేర్కొంది. ఇన్నాళ్లుగా భర్తను చంపేస్తానని బెదిరించడంతో ఆమె బయటకు రాలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిన తర్వాత ఆమె బెంగళూరులో సీఐడీకి ఫిర్యాదు చేసింది. అయితే ప్రజ్వల్ పై పలు కేసులు నమోదయ్యాయి. కాగా, ఎంపీ అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతోనే ప్రజల్వ్ దుబాయ్ మీదుగా జర్మనీకి పారిపోయాడు. అతడ్ని తిరిగి పట్టుకొస్తామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి