iDreamPost

Piyush Chawla: 35 ఏళ్ల ఏజ్ లో చావ్లా క్రేజీ రికార్డ్.. IPL చరిత్రలో రెండో బౌలర్ గా..!

టీమిండియా మాజీ బౌలర్ పియూష్ చావ్లా అరుదైన ఘనతను సాధించాడు. 35ఏళ్ల వయసులో ఐపీఎల్ చరిత్రలోనే ఈ రికార్డు నెలకొల్పిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా మాజీ బౌలర్ పియూష్ చావ్లా అరుదైన ఘనతను సాధించాడు. 35ఏళ్ల వయసులో ఐపీఎల్ చరిత్రలోనే ఈ రికార్డు నెలకొల్పిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Piyush Chawla: 35 ఏళ్ల ఏజ్ లో చావ్లా క్రేజీ రికార్డ్.. IPL చరిత్రలో రెండో బౌలర్ గా..!

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న కోల్ కత్తా వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టీమ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోయినప్పటికీ.. ఆ జట్టు స్టార్ స్పిన్నర్, టీమిండియా మాజీ బౌలర్ పియూష్ చావ్లా అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ రికార్డు నెలకొల్పిన రెండో బౌలర్ గా నిలిచాడు చావ్లా. మరి 35 ఏళ్ల ఏజ్ లో చావ్లా నెలకొల్పిన ఆ రికార్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ స్పిన్నర్ పియూష్ చావ్లా అరుదైన ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ వికెట్ ను పడగొట్టడం ద్వారా చావ్లా ఈ రికార్డ్ సాధించాడు. ఈ వికెట్ తీయడంతో.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. తద్వారా విండీస్ మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో రికార్డ్ ను బ్రేక్ చేశాడు చావ్లా. ఐపీఎల్ ఇప్పటి వరకు 189 మ్యాచ్ లు ఆడిన చావ్లా 184 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 183 వికెట్లను తాజాగా బద్దలు కొట్టాడు ఈ ఓల్డ్ స్పిన్నర్. ఇక ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్. అతడు కేవలం 155 మ్యాచ్ ల్లోనే 200 వికెట్లను కూల్చాడు. మరి 35 ఏళ్ల వయసులో చావ్లా ఈ రికార్డ్ సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి