iDreamPost

8 ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ తెలుగులో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 04, 2024 | 10:41 AMUpdated May 04, 2024 | 10:41 AM

Barbie Telugu OTT: ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఓటీటీలోకి వస్తున్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

Barbie Telugu OTT: ఇటీవల భాషతో సంబంధం లేకుండా ఓటీటీలోకి వస్తున్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

  • Published May 04, 2024 | 10:41 AMUpdated May 04, 2024 | 10:41 AM
8 ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీ తెలుగులో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ శాసిస్తుంది. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ తో సందడి చేస్తుంది. భారతీయ చిత్రాలే కాదు.. ఇతర భాషా చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులు బాషతో సంబంధం లేకుండా చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు ధియేటర్లో రిలీజ్ అయిన సినిమాల ఎప్పుడో కానీ బుల్లితెరపై చూసేవారు. కానీ ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలు నెల రోజుల్లోనే దర్శనమిస్తున్నాయి. కొంతమంది నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీలోని తమ చిత్రాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో ఆస్కార్స్ తో పాటు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న బార్బీ మూవీ తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ లో ఆస్కార్స్ తో పాటు అంతర్జాయ అవార్డులు గెల్చుకొని చరిత్ర సృష్టించింది బార్బీ మూవీ. 2023 లో హాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టి సంచలన రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ హాలీవుడ్ మూవీ తెలుగు లో రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ శనివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్టాట్ ఫామ్ అయిన జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు తో పాటు తమిళ ఆడియోలలో ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీ చూడవొచ్చని జియో సినిమా ఓటీటీ ప్రకటించింది. ఇంగ్లీష్ లో ఈ చిత్రం జియోతో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జియో సినిమా ప్రీమియర్ సబ్ స్క్రైబర్స్ మాత్రమే బర్బీ మూవీ చూసే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్ లో మాత్రం రూ.149 రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది.

Blockbuster Hollywood movie in that OTT!

2023 లో రిలీజ్ అయిన ఈ మూవీ 96వ ఆస్కార్ అవార్డుల్లో ఏనిమిది నామినేషన్స్ ని దక్కించుకుంది. బెస్ట్ పిక్చర్స్, సహాయ నటి, కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ సహాయనటుడు, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే తో పాటు మరికొన్ని విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుంది. 128 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బార్బీ చిత్రం వరల్డ్ వైడ్ గా 1.466 బిలియన్ డాలర్లు రాబట్టింది. కలెక్షన్ల పరంగా ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. భారత్ లో సైతం ఈ చిత్రం దాదాపు 150 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎనిమిది ఆస్కార్స్ గెల్చుకున్న ‘బార్బీ’ ఓటీటీలో చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి