iDreamPost

MI vs KKR: 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ముంబై ఇండియన్స్‌ పరువుతీసిన హార్ధిక్‌ పాండ్యా!

  • Published May 04, 2024 | 10:18 AMUpdated May 04, 2024 | 10:18 AM

KKR vs MI, Wankhede Stadium, IPL 2024: ఐపీఎల్‌ 2024లో 12 ఏళ్లగా చెక్కుచెదరని రికార్డు బద్దలైంది. కేకేఆర్‌ వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌లో జరిగిన ఈ రికార్డ్‌తో ముంబై కెప్టెన్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రికార్డ్‌ గురించి ఇప్పుడు చూద్దాం..

KKR vs MI, Wankhede Stadium, IPL 2024: ఐపీఎల్‌ 2024లో 12 ఏళ్లగా చెక్కుచెదరని రికార్డు బద్దలైంది. కేకేఆర్‌ వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌లో జరిగిన ఈ రికార్డ్‌తో ముంబై కెప్టెన్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రికార్డ్‌ గురించి ఇప్పుడు చూద్దాం..

  • Published May 04, 2024 | 10:18 AMUpdated May 04, 2024 | 10:18 AM
MI vs KKR: 12 ఏళ్ల రికార్డు బ్రేక్‌.. ముంబై ఇండియన్స్‌ పరువుతీసిన హార్ధిక్‌ పాండ్యా!

ఐపీఎల్‌ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. శుక్రవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ 24 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ.. ఆరంభంలో తడబడిన కేకేఆర్‌ తర్వాత కోలుకుని, బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను అతలాకుతలం చేసి.. ఈ సీజన్‌లో 7వ విజయాన్ని అందుకుని.. ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది. కాగా, ఈ విజయంలో కేకేఆర్‌ 12 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. 12 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డను తాజాగా హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలో కోల్పోయింది ముంబై ఇండియన్స్‌. దీంతో.. తొలిసారి ముంబై ఇండియన్స్‌ ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా చేస్తున్న పాండ్యా.. ముంబై పరువుతీశాడంటూ ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ స్టార్టింగ్‌ నుంచి.. అంటే 2008 నుంచి ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ఐపీఎల్‌లో పటిష్టమైన పెద్ద టీమ్స్‌గా చెలామణి అవుతున్నాయి. ముంబై ఇండియన్స్‌ ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిస్తే.. కేకేఆర్‌ రెండు సార్లు కప్పు కొట్టింది. అందుకే ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా రసవత్తరంగా ఉంటుంది. రెండు టీమ్స్‌ విజయం కోసం హోరాహోరీగా తలపడాతాయి. కానీ, వాంఖడే స్టేడియంలో మాత్రం 12 ఏళ్లుగా ముంబై ఇండియన్స్‌ పైచేయి సాధిస్తోంది. కేకేఆర్‌ 2012లో చివరి సారి వాంఖడే గ్రౌండ్‌లో మ్యాచ్‌ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను కేకేఆర్‌ ఓడించింది. దీంతో.. 12 ఏళ్ల రికార్డ్‌ను బద్దలుకొట్టింది.

Pandya

అయితే.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 12 ఏళ్లు కేకేఆర్‌ను వాంఖడేలో గెలవకుండా చేసింది ముంబై ఇండియన్స్‌, కానీ, హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్‌ అయిన తొలి ఏడాదిలోనే ఆ రికార్డును కోల్‌కత్తా బద్దలు కొట్టడం ముంబై ఇండియన్స్‌ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. పైగా.. 2012లో ముంబై ఇండియన్స్‌ని వాంఖడే కేకేఆర్‌ ఓడించిన సమయంలో కేకేఆర్‌ కెప్టెన్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఉన్నాడు. ఇప్పుడు గంభీర్‌ కేకేఆర్‌కు మెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఏదో ఒక విధంగా ముంబైని వాళ్ల సొంతగడ్డపై చిత్తుచేయడంలో గంభీర్‌ హస్తం అయితే ఉంది. కాగా, ఎంత బెస్ట్‌ టీమ్‌ ఉన్నా.. మంచి కెప్టెన్సీ లేకపోతే.. ఏ జట్టు అయినా గెలవడం కష్టం అని పాండ్యా కెప్టెన్సీని ఉద్దేశించి అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నార. మరి 12 ఏళ్ల రికార్డును కేకేఆర్‌ బ్రేక్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి