iDreamPost

ఈ హీరోయిన్‌ ఆమని మేనకోడలు.. తను ఎవరంటే..

  • Published Nov 19, 2023 | 5:03 PMUpdated Nov 19, 2023 | 5:34 PM

సినిమాలు, పాలిటిక్స్‌లో వారసత్వం అనేది చాలా సహజం. ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ ఆమని మేనకోడలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు తను ఎవరంటే..

సినిమాలు, పాలిటిక్స్‌లో వారసత్వం అనేది చాలా సహజం. ఈ క్రమంలో తాజాగా సీనియర్‌ హీరోయిన్‌ ఆమని మేనకోడలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇంతకు తను ఎవరంటే..

  • Published Nov 19, 2023 | 5:03 PMUpdated Nov 19, 2023 | 5:34 PM
ఈ హీరోయిన్‌ ఆమని మేనకోడలు.. తను ఎవరంటే..

సీనియర్‌ నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకలుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గ్లామర్‌ రోల్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి.. ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్ల పాటు కెరీర్‌కు గ్యాప్‌ ఇచ్చిన ఆమని.. ఆ తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రస్తుతం తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రల్లో నటిస్తోంది. అలానే బుల్లితెర మీద కూడా రాణిస్తోంది. ఇక సినిమాలు, రాజకీయాల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్‌. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు తమ పిల్లలు, కుటుంబ సభ్యులను సినిమాల్లోకి తీసుకువస్తారు. అలానే ఆమని వారసురాలు కూడా టాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరీ ఇంతకు ఎవరా భామ అంటే..

ఆమని మేనకోడలు ఇప్పుడు తెలుగులో హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఓ సినిమాలో హీరోయిన్‌గా చేయగా.. తాజాగా రెండో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ఎవరా హీరోయిన్‌ అంటే.. హృతిక శ్రీనివాస్‌. బిగ్‌బాస్‌ విన్నర్‌ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న సౌండ్‌ పార్టీ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. హీరోయిన్‌ హృతికా శ్రీనివాస్‌ తన వ్యక్తిగత వివరాలు, బ్యాగ్రౌండ్‌ డీటెయిల్స్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీనియర్ నటి ఆమని తన అత్త అని తెలిపింది.

తన చిన్నతనం నుంచి తన అత్త ఆమనిని చూస్తూ పెరిగానని.. అలా తనకు బాల్యం నుంచే సినిమాల మీద ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చింది హృతికా శ్రీనివాస్‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్‌గా తెలుగులో తనకు ఇది రెండో సినిమా అని తెలిపింది. తొలి సారి అల్లంత దూరాన సినిమాలో హీరోయిన్‌గా నటించానని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తాను హీరోయిన్‌గా నటిస్తోన్న రెండో చిత్రం సౌండ్‌ పార్టీ అని చెప్పుకొచ్చింది. బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ నటించానని తెలిపింది.

సౌండ్‌ పార్టీ కథ విషయానికి వస్తే.. సంజయ్ స్టోరీ చెప్పినప్పుడు ఎక్సైటింగ్‌గా అనిపించిందన్నది. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్.. కామెడీ తోపాటు కంటెంట్ కూడా ఉందని.. అందుకే ఈ సినిమాకు ఓకే చెప్పినట్టుగా తెలిపింది. ఇందులో తాను సిరి అనే అమ్మాయి పాత్రలో నటించానని.. చాలా తెలివైన అమ్మాయిగా కనిపిస్తానని, సినిమాలో తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది. క్రికెట్ టీంలో ధోనీ ఎంత ముఖ్యమో..ఈ సినిమాకు తన పాత్ర అలా ఉంటుందని డైరెక్టర్ ఎప్పుడు అంటుండేవారని.. ఇక క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీగా మనీ సంపాదించడం కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చింది.

అలానే హీరో సన్నీ గురించి మాట్లాడుతూ.. అతడికి టెలివిజన్‌లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని, బిగ్ బాస్‌లో ప్రేక్షకులు తనని ఎలా చూశారో సెట్‌లోనూ ఆయన అలానే ఉంటాడని చెప్పుకొచ్చింది. చాలా నిజాయతీ గల వ్యక్తి అని.. ఎంతో ఓపెన్‌గా ఉంటారని ప్రశంసలు కురిపించింది. సౌండ్ పార్టీ టైటిల్‌కి కరెక్ట్‌గా సెట్‌ అయ్యేలా సన్నీ నటించాడన్నది. జయశంకర్ ప్రజెంటర్‌గా ఉండడం ఈ సినిమాకు ప్లస్ అయిందని, నిర్మాతలు రవి సార్, మహేంద్ర గజేంద్ర చాలా సపోర్ట్ చేశారని అంది. టాలీవుడ్‌లో సాయి పల్లవి, నాని అంటే తనకిష్టమని చెప్పుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి