iDreamPost
android-app
ios-app

Sundaram Master: సుందరం మాస్టర్‌ హిట్టు కొట్టాడుగా.. ఊహించని రేంజ్‌లో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

  • Published Feb 25, 2024 | 12:32 PM Updated Updated Feb 25, 2024 | 12:32 PM

వైవా హర్షా ప్రధాన పాత్రలో వచ్చిన సుందరం మాస్టర్‌ సినిమా ఊహించని రీతిలో భారీ కలెక్షన్స్‌ సాధించి.. హిట్టు కొట్టాడు. ఆ వివరాలు..

వైవా హర్షా ప్రధాన పాత్రలో వచ్చిన సుందరం మాస్టర్‌ సినిమా ఊహించని రీతిలో భారీ కలెక్షన్స్‌ సాధించి.. హిట్టు కొట్టాడు. ఆ వివరాలు..

  • Published Feb 25, 2024 | 12:32 PMUpdated Feb 25, 2024 | 12:32 PM
Sundaram Master: సుందరం మాస్టర్‌ హిట్టు కొట్టాడుగా.. ఊహించని రేంజ్‌లో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌

యూట్యూబ్‌ వల్ల ఎందరో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్టింగ్‌ మీద ఆసక్తి ఉన్న వాళ్లకి యూట్యూబ్‌ అనేది మంచి వేదికగా మారిది. అక్కడ గుర్తింపు తెచ్చుకున్నవారి నేడు చాలా మంది టీవీలు, సినిమాల్లో నటిస్తున్నారు. ఆ జాబితాలో వైవా హర్ష కూడా ఉన్నారు. యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష.. ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా మారాడు. ఇక కొన్ని రోజుల క్రితం వైవా హర్ష ప్రధాన పాత్రలో సుందరం మాస్టర్‌ అనే సినిమా విడుదలయ్యింది. టీజర్‌, ట్రైలర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ చేశారు. అయితే థియేటర్‌లో మాత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

కానీ ఈ సినిమాలో సుందరం మాస్టార్‌ పాత్రలో హర్ష.. చాలా బాగా నటించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. ప్రపంచానికి సంబంధం లేకుండా అడవిలో ఉండే ఓ పల్లెటూరికి ఇంగ్లీష్ మాస్టర్‌గా వెళ్లి సుందరం అక్కడ ఎలాంటి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. నేర్చుకున్న జీవిత పాఠాలు ఏంటి అనేది ఈ సినిమా. అయితే హీరోగా మొదటి ప్రయత్నంలోనే సూపర్ హిట్ అందుకున్నాడు హర్ష.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ. 2.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేని మూవీ.. కమెడియన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ డే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం అంటున్నారు. హీరోగా ఫస్ట్ మూవీతోనే హర్ష హిట్టు కొట్టాడని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ గురించి తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇందులో దివ్య శ్రీపాద హీరోయిన్ గా నటించింది. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన చిత్రమిది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దాంతో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ బాగానే వచ్చాయి. 2, 3వ రోజు కలెక్షన్స్‌ తగ్గినా.. ఇప్పటికే సుందరం మాస్టర్‌ హిట్టు అంటున్నారు. మరి లాంగ్‌రన్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో చూడాలి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet giriş