iDreamPost

మళ్లీ జగనే CM అన్న విశాల్.. తన కామెంట్స్ ని వక్రీకరించడంపై స్ట్రాంగ్ రిప్లయ్!

Vishal Strong Counter: హీరో విశాల్ ఇటీవల మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారని చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయం చేస్తున్నారు. వారికి మరోసారి విశాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

Vishal Strong Counter: హీరో విశాల్ ఇటీవల మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారని చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయం చేస్తున్నారు. వారికి మరోసారి విశాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

మళ్లీ జగనే CM అన్న విశాల్.. తన కామెంట్స్ ని వక్రీకరించడంపై స్ట్రాంగ్ రిప్లయ్!

విశాల్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తమిళనాడులో సెటిల్ అయినా కూడా విశాల్ తెలుగు వాడు అనే విషయం అందరికీ తెలిసిందే. రత్నం సినిమాతో వస్తున్న విశాల్.. ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో మళ్లీ సీఎంగా జగనే గెలుస్తారు అంటూ విశాల్ చేసిన వ్యాఖ్యలను కావాలని రాజకీయం చేసేందుకు టీడీపీ, జనసేన శ్రేణులు ప్రయత్నాలు చేశాయి. విశాల్ రెడ్డి కాబట్టే.. జగన్ రెడ్డి గెలుస్తాడని చెప్పాడంటూ అక్కసు వెళ్లగక్కారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించడంపై విశాల్ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు. మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.

ఇటీవల విశాల్ ఏపీ రాజకీయాలకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్న విషయం తెలిసిందే. మరోసారి ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా జగనే గెలుస్తారంటూ కామెంట్స్ చేశాడు. అలాగే సీఎం జగన్ చేసిన పాదయాత్ర గురించి చాలా గొప్పగా కామెంట్స్ చేశాడు. విశాల్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన శ్రేణులకు మింగుడు పడలేదు. వెంటనే విశాల్ మీద బురద జల్లడం స్టార్ట్ చేశారు. విశాల్ రెడ్డి కాబట్టే.. జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ నోటికొచ్చింది వాగేశారు. అయితే వారికి మరోసారి విశాల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

విశాల్ తన రత్నం సినిమాకి సంబంధించి విలేకరుల సమావేశం నిర్వహించగా.. తన కామెంట్స్ కి సంబంధించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు కూడా విశాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. అసలు తన వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ సూటి ప్రశ్న వేశాడు. తాను ఐదేళ్ల క్రితం కూడా జగన్ గెలుస్తారనే విషయం చెప్పిన సంగతిని గుర్తు చేశారు. తాను కేవలం తన అభిప్రాయం మాత్రమే చెప్పానంటూ క్లారిటీ ఇచ్చారు. అలాగే అందులే ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని విషయాన్ని స్పష్టం చేశాడు. అసలు తనకు ఏపీలో ఓటు కూడా లేదని.. తనకు తమిళనాడులో ఓటు ఉందని. అక్కడ కూడా ఒక పార్టీని కించ పరుస్తూ తాను వ్యాఖ్యలు చేయను అంటూ గట్టిగానే ఇచ్చి పడేశాడు.

తాను ఐదేళ్ల ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పాడని.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. తాను ఏ పార్టీకి ఓటు వేయమని గానీ.. ఏ పార్టీని కించ పరుస్తూ గానీ వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. తన వ్యాఖ్యలను వివాదాస్పదం చేయొద్దంటూ హూందాగా విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం విశాల్ రత్నం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ మరో పందెం కోడి అవుతుందనే అభిప్రాయాలు తెలుగు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి