iDreamPost

ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. జరిగింది ఒకటి! ప్రచారం మరొకటి! పూర్తి నిజాలు!

  • Published Feb 27, 2024 | 3:08 PMUpdated Feb 27, 2024 | 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఘటనలో జరిగింది ఒకటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నాయి. పూర్తి నిజాలు మీ కోసం..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఘటనలో జరిగింది ఒకటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నాయి. పూర్తి నిజాలు మీ కోసం..

  • Published Feb 27, 2024 | 3:08 PMUpdated Feb 27, 2024 | 3:08 PM
ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. జరిగింది ఒకటి! ప్రచారం మరొకటి! పూర్తి నిజాలు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైజాగ్‌ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఘటనపై విపక్షాలు, టీడీపీ అనుకూల మీడియా పని గట్టుకుని అసత్యం ప్రచారం చేస్తోంది. అసలేం జరిగింది అన్న దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ ఉన్నా సరే.. తప్పుడు ప్రచారం మాత్రం ఆపడం లేదు. మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తే.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందని సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ.. రాష్ట్ర పరువు తీసే పనిలో ఉన్నారు ప్రతిపక్ష నేతలు.

ఓ వైపు ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. విపక్షాలు మాత్రం.. దాన్ని చూసి ఓర్వలేక.. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లపై దుష్ప్రచారానికి తెర లేపాయి. ప్రజలకు సంక్షేమ పాలనతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తోంటే.. విపక్షాలు మాత్రం.. కావాలని అసత్య ప్రచారం చేస్తూ.. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దానిలో భాగమే ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ కూలిపోయిందంటూ అసత్య ప్రచారం.

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ను రెండు రోజుల క్రితం ప్రారంభించింది. దీన్నిచూసేందుకు పెద్ద ఎత్తున పర్యటలకు తరలి వచ్చారు. అయితే సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సోమవారం నుంచి మూడు రోజుల పాటు సందర్శకులను ఎవ్వరిని ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ మీదకు అనుమంతించలేదు. దీని గురించి ముందుగానే జనాలకు సమాచారం అందించారు. ఈ క్రమంలో బ్రిడ్జ్‌ టీ జాయింట్‌ పటిష్టతను పరిశీలించడానికి దానిపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని భావించారు. ఇందుకు సంబంధించి అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను డీ లింక్‌ చేసి అక్కడకు దగ్గరలో ఏర్పాటు చేసిన యాంకర్లకు దగ్గరగా జరిపి ఉంచారు.

ఇలా జరిపినప్పుడు వాటి మధ్యలో కనిపించిన ఖాళీ ప్రాంతాన్ని ఫొటోలు తీసి.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందంటూ అసత్య ప్రచారానికి తెర లేపారు విపక్ష నాయకులు. డీ–లింక్‌ చేసి మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తే.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందంటూ సోషల్‌ మీడియా గగ్గోలు పెట్టారు. ఓ వైపు జగన్‌ సర్కార్‌ విశాఖ పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అది చూసి ఓర్వలేక ఆ ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నాలు ప్రారంభించాయి. దానిలో భాగమే ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ మీద చేసిన అసత్య ప్రచారం. ఇక దీనిపై స్పందించిన అధికారులు.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని.. మాక్‌ డ్రిల్‌ సందర్భంగా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిన డీ–లింక్‌ చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అసలేం జరిగిందో వివరించారు.

అందుకే పర్యాటకులను అనుమతించలేదు..

అనంతరం దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్‌ నుంచి ప్లాట్‌ఫాంను డీ లింక్‌ చేశామన్నారు. కానీ కొందరు మిడి మిడి జ్ఞానంతో.. పూర్తిగా తెలుసుకోకుండా.. ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ తెగిపోయిందని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం ప్రారంభించారని.. ఇది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. అంతేకాక వాతావరణంలో మార్పులు కారణంగానే సోమవారం సందర్శకులను అనుమతించలేదని అధికారులు వివరించారు.

ప్రతి నెలా పౌర్ణమి, అమావాస్య సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని.. ఆ సమయాల్లో సాంకేతిక పరిశీలనలో భాగంగా సర్వసాధారణంగా చేపట్టే చెకింగ్‌ చర్య ఇది అని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎప్పుటికప్పుడు పటిష్టతను పరిశీలించేందుకు మాక్‌డ్రిల్స్‌ చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా దీనిపై అసత్య ప్రచారాన్ని మానుకోవాలని విపక్షాలకు సూచించారు అధికారులు.

ఇతర రాష్ట్రాల్లో పరిశీలించాకే..

విశాఖలో పర్యాటకాభివృద్ధి కోసం.. వీఎంఆర్‌డీఏ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ను ప్రారంభించాలని భావించింది. అందుకోసం కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌లను పరిశీలించారు. ఆ తర్వాత పీపీపీ విధానంలో విశాఖలో ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ ఏర్పాటుకు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. ఇందులో సాయి మోక్షా షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ సంస్థ ఫ్లోటింగ్‌ బ్రిడ్జ్‌ టెండర్‌ దక్కించుకుంది. నిపుణులైన కార్మికులతో విశాఖలో సబ్‌మైరెన మ్యూజియానికి సమీపంలో బ్రిడ్జ్‌ ఏర్పాటు చేశారు. దాన్ని ఆదివారం రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సోమవారం నుంచి పర్యాటకులను అనుమతించలేదు. ఇదే సమయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా.. సోషల్‌ మీడియా వేదికగా అసత్య ప్రచారానికి తెర లేపి.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు దీనిపై స్పందించి.. అసలు వాస్తవాలు వెల్లడించడంతో ప్రజలు సైతం వారిని ఛీ కొడుతున్నారు. జగన్‌ను దెబ్బ తీయడానికి ఆఖరికి రాష్ట్ర పరువు ప్రతిష‍్టలను కూడా దిగజార్చడానికి వెనకాడటం లేదంటూ జనాలు విపక్షాలపై మండిపడుతున్నారు. ఈ సంఘటనతో మరోసారి విపక్షాల వక్రబుద్ధిపై జనాలకు ఓ క్లారిటీ వచ్చింది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి