iDreamPost

Virender Sehwag: పాకిస్తాన్ పై సెహ్వాగ్ ఫైర్.. బాబర్ కు మాస్ వార్నింగ్!

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఘాటైన వ్యాఖ్యలతో పాక్ టీమ్ తో పాటుగా కెప్టెన్ బాబర్ అజామ్ ను విమర్శించాడు. ఈ క్రమంలోనే బాబర్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఘాటైన వ్యాఖ్యలతో పాక్ టీమ్ తో పాటుగా కెప్టెన్ బాబర్ అజామ్ ను విమర్శించాడు. ఈ క్రమంలోనే బాబర్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

Virender Sehwag: పాకిస్తాన్ పై సెహ్వాగ్ ఫైర్.. బాబర్ కు మాస్ వార్నింగ్!

గడిచిన వన్డే వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యంతో నాకౌట్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్.. ఆ సంప్రదాయాన్ని టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించింది. ఈ మెగాటోర్నీలో అమెరికా లాంటి పసికూన చేతిలో ఓడిపోయి, గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. దాంతో పాకిస్తాన్ పై ఆ దేశ దిగ్గజాలతో పాటుగా.. వరల్డ్ వైడ్ గా ఉన్న లెజెండ్స్, మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఘాటైన వ్యాఖ్యలతో పాక్ టీమ్ తో పాటుగా కెప్టెన్ బాబర్ అజామ్ ను విమర్శించాడు. ఈ క్రమంలోనే బాబర్ కు మాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పోరు ముగిసింది. ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్ లోనే అమెరికా చేతిలో ఓడిపోయి.. తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది. ఇక రెండో మ్యాచ్ లో టీమిండియా చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత పసికూన కెనడాపై విజయం సాధించి.. అదృష్టం కోసం ఎదురుచూసింది. అమెరికాపై ఐర్లాండ్ విజయం సాధించాలని, ఆ తర్వాత ఐర్లాండ్ ను ఓడించి సూపర్ 8కు చేరాలని భావించింది పాక్. కానీ పాకిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ రద్దు అయ్యింది. దాంతో 5 పాయింట్లతో అమెరికా సూపర్ 8కు వెళ్లింది.. పాక్ ఇంటిదారి పట్టింది.

టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్తాన్ పై, కెప్టెన్ బాబర్ అజామ్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు టీమిండియా మాజీ ప్లేయర్, డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. “పాకిస్తాన్ ఆడలేక సాకులు వెతుకుతోంది. మీరు వర్షాన్ని ఎలా నిందిస్తారు? ఒకవేళ మీరు గెలిచినప్పటికీ.. తదుపరి దశకు వెళ్లే అర్హత పాకిస్తాన్ కు లేదు. ఎందుకంటే? అక్కడ కూడా వారు ఓడిపోతారు. సూపర్ 8లో సులువైన టీమ్స్ లేవు. మీరు అమెరికా చేతిలో ఓడిపోయారని గుర్తుంచుకోండి. ఇక బాబర్ టీ20 ఫార్మాట్ కు పనికిరాడు. గుర్తుంచుకో.. వచ్చే వరల్డ్ కప్ లో నువ్వు ఆడాలంటే.. నీ గేమ్ మెరుగుపర్చుకోవాలి. బాబర్ తో పాటుగా మరికొందరు పాక్ ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు పనికిరారు” అంటూ విమర్శించాడు వీరూ భాయ్. ఇక పాకిస్తాన్ వెళ్లిన తర్వాత బాబర్ తన టీమ్ తో ఓటమికి కారణాలు ఏంటో చర్చించుకోవాలని సలహా ఇచ్చాడు. అంతేగానీ.. వర్షం కారణంగా ఓడిపోయాం అంటూ సిల్లీ సాకులు చెప్పొందని వార్నింగ్ ఇచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి