iDreamPost

ఫైనల్ కి ముందు కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఇది కదా మజా!

వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు ముందే కింగ్ కోహ్లీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అరుదైన రికార్డులను నెలకొల్పుతూ క్రికెట్ హిస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. దీంతో ఛేజ్ మాస్టర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ కు ముందే కింగ్ కోహ్లీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అరుదైన రికార్డులను నెలకొల్పుతూ క్రికెట్ హిస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. దీంతో ఛేజ్ మాస్టర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్ కి ముందు కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఇది కదా మజా!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. క్రికెట్ దేవుడి రికార్డును బద్దలు కొట్టి అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేసి నిరూపించారు విరాట్. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా జరిగిన సెమీఫైనల్లో న్యూజీలాండ్ పై సెంచరీ బాదీ వన్డేల్లో 50వ శతకాన్ని పూర్తి చేశారు కింగ్ కోహ్లీ. సెంచరీల హాఫ్ సెంచరీని సాధించిన రన్ మెషీన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు అభినందను తెలిపారు. పరుగులు రారాజు ఫ్యాన్స్ లో ఆనందం ఆకాశాన్నంటింది. తమ అభిమాన క్రికెటర్ సాధించిన ఘనతకు ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి శుభ తరుణంలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు కోహ్లీ. విరాట్ మైనపు విగ్రహాన్ని జైపూర్ నహర్ గడ్ కోటలోని వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రోహిత్ సారథ్యంలోని టీమిండియా గ్రాండ్ గా ప్రపంచ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు ఓటమనేదే లేకుండా విజయ దుందుభీ మోగిస్తూ ఫైనల్ సమరానికి సన్నద్ధమవుతోంది. నవంబర్ 19న జరిగే ఫైనల్స్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అయితే ఫైనల్స్ ముంగిట కోహ్లీ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను అందించింది జైపూర్ వ్యాక్స్ మ్యూజియం. సెంచరీల రారాజు కింగ్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు జైపూర్ వ్యాక్స్ మ్యూజియం వెల్లడించింది. 50 సెంచరీలు పూర్తి చేసిన ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ వెల్లడించారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బ్రేక్ చేసి అరుదైన ఫీట్ ను సాధించారు కోహ్లీ. కాబట్టి విగ్రహ ఏర్పాటుకు ఇంతకంటే గొప్ప క్షణాలు ఏముంటాయని శ్రీవాస్తవ తెలిపారు. దీంతో పాటు ఎప్పటి నుంచో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోహ్లీ ఫ్యాన్స్ తోపాటు పర్యాటకులు కూడా కోరుతున్నట్లు వెల్లడించారు. నెల రోజుల్లో కింగ్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ వాస్తవ స్పష్టం చేశారు. దీంతో విరాట్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఆదివారం జరుగబోయే ఫైనల్స్ లో ఆసిస్ తో భారత్ ఢీకొనబోతోంది. అసాధారణ ఆటతో టైటిల్ నెగ్గాలనే దృఢ సంకల్పంతో రోహిత్ సేన ప్రణాళికలు రచిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి