నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. అతడు వికెట్ తీసిన టైమ్‌లో అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ వేయడమే గాక ఒక వికెట్ కూడా తీశాడు. అతడు వికెట్ తీసిన టైమ్‌లో అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వరల్డ్ కప్‌లో భారత టీమ్ విజయాల పరంపరను కంటిన్యూ చేస్తోంది. తొమ్మిదికి తొమ్మిది మ్యాచుల్లోనూ నెగ్గి ఫస్ట్ ప్లేస్‌తో సెమీస్‌కు దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ సెమీస్‌కు ముందు రోహిత్ సేనకు ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ (61), విరాట్ కోహ్లీ (51) ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. అయితే శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 51) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదిరిపోయే స్టార్ట్ అవ్వడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్)-కేఎల్ రాహుల్ (102) సెంచరీల మోత మోగించడం నాకౌట్ మ్యాచ్‌కు ముందు భారత్ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుందని చెప్పొచ్చు. బ్యాట్స్‌మెన్ అందరూ అద్భుతంగా రాణించడంతో టీమిండియా 410 పరుగుల భారీ స్కోరు చేసింది. డచ్ టీమ్ ముందు కొండంత టార్గెట్ ఉండటంతో బౌలింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయోగాలకు దిగాడు.
ఈ మ్యాచ్‌లో ఏకంగా 9 మంది బౌలర్లను వినియోగించాడు రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ మధ్యలో విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌తో బౌలింగ్ వేయించిన హిట్‌మ్యాన్.. ఆఖర్లో తానూ బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. ఇలా వరల్డ్ కప్స్‌లో అత్యధిక మంది బౌలర్ల (తొమ్మిది మంది)ని ఉపయోగించడం 31 ఏళ్ల తర్వాత ఇదే ఫస్ట్ టైమ్. 1992 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ 9 మంది బౌలర్లను వినియోగించగా.. అంతకుముందు 1987 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ టీమ్ తొమ్మిది మందితో బౌలింగ్ చేయించింది. ఇక ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ వికెట్ తీసుకున్నప్పుడైతే స్టేడియం మొత్తం ఊగిపోయింది. ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ అతడ్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ వికెట్ సమయంలో ఆడియెన్స్‌తో పాటు విరాట్ భార్య అనుష్క శర్మ కూడా సంబురాల్లో మునిగిపోయింది.
కోహ్లీ వికెట్ తీయగానే అనుష్క శర్మ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. చప్పట్లు కొడుతూ, నవ్వుతూ, గెంతులేస్తూ ఆమె సెలబ్రేట్ చేసుకుంది. వికెట్ తీసిన సంతోషంలో అనుష్క వైపు చూస్తూ సాధించానంటూ విరాట్ సైగ్ చేశాడు. అవునవును చేసి చూపావంటూ ఆమె కూడా అతడికి సపోర్ట్‌గా పిడికిలి బిగించి అభివాదం చేసింది. కోహ్లీ-అనుష్కల రియాక్షన్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్.. కపుల్ గోల్స్ అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు. వికెట్ తీస్తానని ముందే అనుష్కకు విరాట్ మాటిచ్చాడని.. అందుకే వాళ్లిద్దరూ ఒకేలా సెలబ్రేట్ చేసుకున్నారని మరికొందరు అంటున్నారు. మరి.. విరాట్ వికెట్‌కు అనుష్క ఇచ్చిన రియాక్షన్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అంతా బాగానే ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలోనే ద్రవిడ్ వెనుకబడ్డాడా?
The moment when Virat Kohli gets a wicket.
Look at the happiness of Anushka Sharma pic.twitter.com/7ppAg7yB9u— Yamini 🦋 (@YaminiICT) November 13, 2023