మరొక్క శతకం బాదితే వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఎవరూ సాధించని ఘనతను తన పేరిట సువర్ణాక్షలతో లిఖించుకుంటాడు కింగ్ కోహ్లీ. ఇదంతా ఒకెత్తు అయితే.. విరాట్ అంటే టీమిండియా, టీమిండియా అంటే విరాట్ అనేంతగా మారిపోయాడు.
మరొక్క శతకం బాదితే వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఎవరూ సాధించని ఘనతను తన పేరిట సువర్ణాక్షలతో లిఖించుకుంటాడు కింగ్ కోహ్లీ. ఇదంతా ఒకెత్తు అయితే.. విరాట్ అంటే టీమిండియా, టీమిండియా అంటే విరాట్ అనేంతగా మారిపోయాడు.
విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరును కొలవడానికి కొలమానాలు అంటూ ఏమీ లేవనుకుంటా. అంతలా అతడి ఆటతీరు ఉంది మరి. దానికి విరాట్ సాధించిన గణాంకాలే నిదర్శనంగా నిలుస్తూ వస్తున్నాయి. మరొక్క శతకం బాదితే వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఎవరూ సాధించని ఘనతను తన పేరిట సువర్ణాక్షలతో లిఖించుకుంటాడు కింగ్ కోహ్లీ. ఇదంతా ఒకెత్తు అయితే.. విరాట్ అంటే టీమిండియా, టీమిండియా అంటే విరాట్ అనేంతగా మారిపోయాడు. తాజాగా కొన్ని రికార్డులు చూస్తే.. టీమిండియా కంటే కోహ్లీ బ్రాండ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మరి ఆ రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వరల్డ్ కప్ లో పరుగుల వరద పారిస్తున్నాడు టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ. ఈ మెగాటోర్నీలో ఒకపక్క తన బ్యాట్ తో రికార్డులు కొల్లగొడుతూ.. మరోపక్క తన బ్రాండ్ రేంజ్ ను ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. దీంతో ఇండియా అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఇండియా అనేంతగా మారిపోయాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ రేంజ్ ఘనతను సాధించి ఔరా అనిపించాడు విరాట్ భాయ్. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ ఇండియా బ్రాండ్ కంటే విరాట్ కోహ్లీనే రియల్ బ్రాండ్ లా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ విరాట్ సాధించిన ఆ ఘనత ఏంటో చూద్దాం.
ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో.. కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు 4.4 కోట్ల మంది మ్యాచ్ ను వీక్షించారు. అలాగే న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా విరాట్ బ్యాటింగ్ ను 4.3 కోట్ల మంది చూశారు. ఈ రెండూ కూడా స్పోర్ట్స్ హిస్టరీలోనే అత్యధిక వ్యూయర్ షిప్ గా రికార్డు సృష్టించాయి. దీంతో కోహ్లీ ఈజ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్ అంటూ కితాబిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. అయితే మరికొందరు మాత్రం ఇండియా లేనిది కోహ్లీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Highest Viewership in Sports History:
4.4 Cr – Virat batting against South Africa.
4.3Cr – Virat batting against New Zealand.
Virat Kohli – The Biggest Brand..!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 5, 2023