వన్డే వరల్డ్ కప్-2023ని టీమిండియా గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాతో ఫస్ట్ మ్యాచ్ ఆడిన భారత్.. అందులో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఒక దశలో మ్యాచ్ చేజారినట్లే కనిపించినా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పట్టువదలకుండా ఆడి గెలిపించారు. ఇద్దరూ సంయమనంతో ఆడుతూ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. క్రీజులో కుదురుకున్నాక షాట్లు కొడుతూ మ్యాచ్‌ను కంగారూల చేతి నుంచి లాక్కున్నారు. ఈ మ్యాచ్‌లో విజయంతో జోష్‌లో ఉన్న భారత జట్టు.. నెక్స్ట్ అఫ్ఘనిస్థాన్‌తో పోరుకు రెడీ అవుతోంది.
ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే అంతకంటే ముందే విరాట్ చేసిన ఒక పని ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టైమ్‌లో స్టేడియంలోని డీజే.. ‘కోహ్లీ.. కోహ్లీ..’ అని అరుస్తూ అభిమానులు కూడా విరాట్‌ను చీర్ చేయాలని మైక్‌లో కోరాడు. అయితే ఇది విన్న కోహ్లీ వెంటనే వెనక్కి తిరిగాడు. ఫ్యాన్స్ చీర్ చేయాల్సింది తనను కాదంటూ పిచ్ వైపు చూపించాడు. ఆ సమయంలో బౌలింగ్ చేస్తున్న జస్ప్రీత్ బుమ్రాను చూపిస్తూ అతడ్ని చీర్ చేయాలని డీజేకు కోహ్లీ సూచించాడు.
కోహ్లీని గమనించిన డీజే కూడా ‘విరాట్ చెబుతున్నాడు.. ఇక బుమ్రాను చీర్ చేయండి’ అని అనడంతో ఫ్యాన్స్ వెంటనే బుమ్రాను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. విరాట్ డీజేకు సూచనలు ఇచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో నెట్టింట విరాట్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ తన గొప్ప మనసును మరోమారు చాటుకున్నాడని కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీని కింగ్ అనేది ఇందుకేనని అంటున్నారు. తన కోసం కాకుండా టీమ్ కోసం, జట్టులోని ప్లేయర్ల కోసం అండగా నిలబడతాడు కాబట్టే కోహ్లీని రియల్ కింగ్ అంటారంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మరి.. బుమ్రా కోసం కోహ్లీ చేసిన పనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సెంచరీ సరే.. ఈ అతి ఏంటి రిజ్వాన్! పరువు పోయింది!
Virat Kohli asks Chennai DJ to stop cheering for him and chant Bumrah’s name instead. READ ⬇️https://t.co/IKTG2g8I3t
— Wisden (@WisdenCricket) October 8, 2023