iDreamPost

రోహిత్-కోహ్లీ కెరీర్​పై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్.. అలా చేస్తే బెటర్ అంటూ..!

  • Author singhj Published - 02:07 PM, Sat - 25 November 23

టీమిండియా టాప్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్​పై పాక్ లెజెండ్ వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా టాప్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్​పై పాక్ లెజెండ్ వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 02:07 PM, Sat - 25 November 23
రోహిత్-కోహ్లీ కెరీర్​పై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్.. అలా చేస్తే బెటర్ అంటూ..!

క్రికెట్ లవర్స్​ను రెండు నెలల పాటు అలరించిన వన్డే వరల్డ్ కప్-2023 ముగిసింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ మీద పడింది. పొట్టి ఫార్మాట్​లో కప్పు కొట్టడంపై అన్ని టీమ్స్ ఫోకస్ పెడుతున్నాయి. ఆ వరల్డ్ కప్​కు మరో 7 నెలల టైమ్ మాత్రమే మిగిలి ఉండటంతో సన్నద్ధతకు పదును పెడుతున్నాయి. భారత జట్టు కూడా వరుసగా టీ20 సిరీస్​ల్లో ఆడుతూ ప్రిపరేషన్స్​ను గట్టిగా ప్లాన్ చేస్తోంది. మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఆడతారు కాబట్టి మన క్రికెటర్ల సన్నద్ధతకు ఢోకా లేదు. అయితే వచ్చే టీ20 వరల్డ్ కప్​లో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.

గత సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్​లో ఆడలేదు. ఈ ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్​లో వరల్డ్ కప్ ఉండటంతో కేవలం వన్డేలు, టెస్టులకే పరిమితం అయ్యారు. ఈసారి మెగా టోర్నీలో రోహిత్-కోహ్లీలు తమ పెర్ఫార్మెన్స్​తో దుమ్మరేపినప్పటికీ టీమ్​కు కప్పును మాత్రం అందించలేకపోయారు. దీంతో వీళ్లిద్దరి కెరీర్​పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. టీ20ల్లో ఆడతారా? లేదా టెస్టులు, వన్డేల్లోనే వీరు కంటిన్యూ అవుతారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో ఫైనల్ డెసిషన్​ను ఈ ఇద్దరు స్టార్లకే వదిలేసిందట బీసీసీఐ.

ఏ ఫార్మాట్​లో కంటిన్యూ అవ్వాలి, దేనికి దూరంగా ఉండాలని కోహ్లీ-రోహిత్​నే తేల్చుకోమని బీసీసీఐ వదిలేసిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కెరీర్ కొనసాగింపు విషయంలో ఈ ఇద్దరు లెజెండరీ బ్యాటర్లకు భారత క్రికెట్ బోర్డు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తప్పకుండా ఆడాలని ఆయన అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్​కు ఇంకా ఎక్కువ టైమ్ లేదని.. అయితే అందులో ఆడే భారత టీమ్​లో మాత్రం రోహిత్, కోహ్లీ తప్పకుండా ఉండాలన్నాడు అక్రమ్.

‘టీ20 వరల్డ్ కప్​కు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఆ టోర్నమెంట్​లో ఎవర్ని ఆడించాలంటే మాత్రం నేను కోహ్లీ, రోహిత్​ను ఎంచుకుంటా. వాళ్లిద్దరూ టీమిండియాకు చాలా కీలకం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. టీ20ల్లో యంగ్​స్టర్స్​తో పాటు ఎక్స్​పీరియెన్స్ ఉన్నవాళ్లూ కావాలి. పూర్తిగా యువకుల మీదే డిపెండ్ అవ్వలేం’ అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. అక్రమ్​తో పాటు చాలా మంది సీనియర్లు వచ్చే టీ20 వరల్డ్ కప్​లో రోహిత్, కోహ్లీని ఆడించాలని సూచిస్తున్నారు. వీళ్ల అనుభవం టీమిండియాకు కలిసొస్తుందని.. ఇలాంటి ప్లేయర్లు టీమ్​లో ఉంటే అపోజిషన్ టీమ్స్ భయపడతాయని అంటున్నారు. అటాకింగ్​కు దిగే హిట్​మ్యాన్, ఇన్నింగ్స్​ను బిల్డ్ చేసే కోహ్లీ ఉంటే భారత్​కు ఢోకా ఉండదని చెబుతున్నారు. మరి.. రోహిత్, కోహ్లీ కెరీర్​ విషయంలో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీ ఫిక్స్.. ఆ ఫ్రాంచైజీకి మెంటార్​గా వెళ్లనున్న మిస్టర్ కూల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి