iDreamPost

ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీ ఫిక్స్.. ఆ ఫ్రాంచైజీకి మెంటార్​గా వెళ్లనున్న మిస్టర్ కూల్!

  • Author singhj Published - 12:52 PM, Sat - 25 November 23

రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీకి అంతా ఫిక్స్ అయిందని సమాచారం. లీగ్​లోని ఓ ఫ్రాంచైజీకి ఆయన మెంటార్​గా వెళ్లడం దాదాపు ఖాయమైందని టాక్.

రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీకి అంతా ఫిక్స్ అయిందని సమాచారం. లీగ్​లోని ఓ ఫ్రాంచైజీకి ఆయన మెంటార్​గా వెళ్లడం దాదాపు ఖాయమైందని టాక్.

  • Author singhj Published - 12:52 PM, Sat - 25 November 23
ద్రవిడ్ ఐపీఎల్ రీఎంట్రీ ఫిక్స్.. ఆ ఫ్రాంచైజీకి మెంటార్​గా వెళ్లనున్న మిస్టర్ కూల్!

వన్డే వరల్డ్ కప్ ముగిసిపోవడంతో ఇప్పుడు టీమిండియా ఆడే మిగతా సిరీస్​లపై అందరి ఫోకస్ నెలకొంది. టీ20 ప్రపంచ కప్​కు మరో ఏడు నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో ఇప్పటి నుంచే టీమ్​ను బిల్డ్ చేసుకోవాలి. అందులో భాగంగానే వరుసగా టీ20 సిరీస్​లను షెడ్యూల్ చేసింది భారత క్రికెటో బోర్డు (బీసీసీఐ). ఈ షెడ్యూల్​లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కూడా మొదలైపోయింది. వచ్చే పలు నెలల పాటు టీ20, టెస్ట్ సిరీస్​లు ఆడుతూ.. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​)లో ఆడుతూ టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉండనున్నారు. అయితే మెగా టోర్నీ ముగిసిపోవడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే కెరీర్ ఎండ్ అయినట్లేనా? వీళ్లు టీ20ల్లో కంటిన్యూ అవుతారా? అనే డిస్కషన్ మొదలైంది.

విరాట్-రోహిత్​ కెరీర్ విషయంలో ఫైనల్ డెసిషన్​ను వాళ్లిద్దరికే బీసీసీఐ వదిలేసిందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఏ ఫార్మాట్​లో కొనసాగాలి? దేనికి గుడ్ బై చెప్పాలనేది వాళ్ల నిర్ణయానికే వదిలేసిందట. అయితే ఇదే టైమ్​లో టీమిండియా కోచ్​గా రాహుల్ ద్రవిడ్ ఫ్యూచర్ మీదా చర్చ జరుగుతోంది. అఫీషియల్​గా ఆయన పదవీకాలం ముగిసింది. కానీ ద్రవిడ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటాడా? బోర్డు ఆయనకు ఛాన్స్ ఇస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. రెండేళ్ల పదవీ కాలంలో భారత్​ను అన్ని ఫార్మాట్లలోనూ నంబన్ వన్ స్థానానికి చేర్చాడు మిస్టర్ కూల్. ఆయన కోచింగ్​లోనే టీమ్ వరల్డ్ కప్ నెగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడి కప్పును చేజార్చుకుంది.

ద్రవిడ్ పదవీ కాలం పూర్తవ్వడంతో ఆసీస్​తో టీ20 సిరీస్​కు వీవీఎస్ లక్ష్మణ్​ను తాత్కాలిక కోచ్​గా నియమించారు. అయితే మిస్టర్ కూల్ ఓకే అంటే అతడి కాంట్రాక్ట్​ను బీసీసీఐ మరో ఏడాది పాటు పొడిగించే ఛాన్స్ ఉందట. కానీ దానికి ద్రవిడ్ నో చెప్పినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. టీమిండియా కోచ్​గా కంటిన్యూ అయ్యే ఆసక్తి ఆయనకు లేదట. దీంతో ఆయన స్థానంలో లక్ష్మణ్​ ఫుల్ టైమ్ హెడ్​ కోచ్​గా బాధ్యతలు స్వీకరించడం ఫిక్స్ అని అంటున్నారు. లక్షణ్​కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను బీసీసీఐ అధికారులు రెడీ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ద్రవిడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. టీమిండియాకు కోచ్​గా బాధ్యతలు తీసుకోకముందు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్​సీఏ)కు హెడ్​గా ఉన్నాడు ద్రవిడ్. ఇప్పుడు లక్ష్మణ్​కు సీనియర్ టీమ్ బాధ్యతలు అప్పజెప్పి.. మళ్లీ ఎన్​ఏసీకు మిస్టర్ కూల్ వెళ్తాడని వార్తలు వస్తున్నాయి.

ఐపీఎల్​ రీఎంట్రీకి ద్రవిడ్ ఇంట్రెస్ట్​గా ఉన్నాడని కూడా వినిపిస్తోంది. మెగా లీగ్​లోని రెండు ఫ్రాంచైజీలు ఆయనతో టచ్​లో ఉన్నాయట. రాజస్థాన్ రాయల్స్​తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ ఆయనతో చర్చలు జరుపుతున్నాయట. వీటిల్లో ఏదో ఒక ఫ్రాంచైజీకి ఆయన మెంటార్​గా వెళ్లే ఛాన్స్ ఉందని టాక్. గతంలో మెంటార్​గా ఉన్న గౌతం గంభీర్​ ఇప్పుడు కేకేఆర్​కు వెళ్లిపోవడంతో ఆ పొజిషన్​లో ద్రవిడ్​ను కూర్చోబెట్టాలని లక్నో మేనేజ్​మెంట్ భావిస్తోందట. అయితే తాను గతంలో కెప్టెన్సీ వహించిన రాజస్థాన్​కు వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై అటు ఆ ఫ్రాంచైజీలు గానీ ఇటు ద్రవిడ్ గానీ ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి.. ద్రవిడ్ ఐపీఎల్​ రీఎంట్రీ న్యూస్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కప్పు రాకున్నా అతడు దొరికాడు చాలంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి