iDreamPost
android-app
ios-app

సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అద్భుతం.. వైరల్ అవుతున్న వీడియో!

  • Published May 30, 2024 | 10:00 PM Updated Updated May 30, 2024 | 10:00 PM

కొన్ని సార్లు అద్భుత దృశ్యాలు సాక్షాత్కారం అవుతుంటాయి. ఇవి మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

కొన్ని సార్లు అద్భుత దృశ్యాలు సాక్షాత్కారం అవుతుంటాయి. ఇవి మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది.

  • Published May 30, 2024 | 10:00 PMUpdated May 30, 2024 | 10:00 PM
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అద్భుతం.. వైరల్ అవుతున్న వీడియో!

కొంత మంది దేవతలు, దెయ్యాలు ఉన్నాయని బలంగా విశ్వసిస్తుంటారు. మరి కొంత మంది అసలు అదంతా అభూత కల్పన అని కొట్టిపారేస్తుంటారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ నాన్సెస్ ఏంటీ అంటూ మాట్లాడుతుంటారు. కానీ కొన్ని వింతలు చూస్తుంటే.. ఏదో తెలియని శక్తి నడిపిస్తుందని అనిపిస్తుంటారు. అది కచ్చితంగా దైవమే అని నమ్మేవాళ్లే ఎక్కువ. తాజాగా అలాంటి ఓ అద్భుత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది చూసి అక్కడి జనాలంతా ఇది కచ్చితంగా దైవ లీలే అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ఆ వింత ఏంటంటే.. సుబ్రమణ్య స్వామి ఆలయంలో నెమలి కనిపించింది. అందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అక్కడో ఓ అద్భుతం దాగి ఉంది.

తమిళనాడు తిరుప్పూర్‌ జిల్లాలోని అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది.  ఆలయంలోని గర్భగుడి వద్ద నెమలి కనిపించింది.  ఆ సుందర దృశ్యాన్నిచూసి భక్తులు పులకరించిపోయారు.  ఎందుకంటే.. నెమలిని కుమార స్వామి వాహనంగా చెబుతుంటారు. ఇప్పుడు ఆ కుమార  స్వామియే సుబ్రమణ్యుడు కాబట్టి ఆ నెమలే ఇక్కడకు వచ్చిందని చెప్పుకుంటున్నారు.   గత వారం ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతా ఆ దేవుడి మహిమే అంటున్నారు భక్తులు.  వందలాది మంది భక్తుల సమక్షంలో గుడిలోకి వచ్చింది నెమలి.  సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది.

సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది జనాలు ఉన్నా.. నెమలి కదలకుండా మెదలకుండా అక్కడే అలాగే నిల్చుకుంది. పూజ పూర్తయ్యి.. హారతి ఇచ్చేంత వరకు అక్కడే నిలబడిందని అంటున్నారు స్థానికులు. ఆ సుబ్రమణ్యుడే ఈ రూపంలో వచ్చారని అంటున్నారు.  ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.  నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘నెమళ్లు తరచుగా ఈ ఆలయానికి వస్తుంటాయి. అయితే ఈ సారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి సుబ్రమణ్య స్వామిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఈ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులకు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది’ అని పేర్కొన్నారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు.. . ఇది దేవుడి మహిమకు నిలువెత్తు నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet