iDreamPost

Allu Arjun: పుష్ప 2కు కష్టాలు.. ఇలాగైతే కలెక్షన్లకు భారీ దెబ్బ!

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీకి కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా మరో వార్త బన్నీ ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 మూవీకి కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా మరో వార్త బన్నీ ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Allu Arjun: పుష్ప 2కు కష్టాలు.. ఇలాగైతే కలెక్షన్లకు భారీ దెబ్బ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న చిత్రం పుష్ప 2. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే పుష్ప 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉండటం, రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. అనుకున్న టైమ్ కు పుష్ప రాదేమోనన్న వార్తలు బయలుదేరాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి మరో సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పుష్ప 2 ఓపెనింగ్స్ పై భారీ దెబ్బపడటం ఖాయంగా చెబుతున్నారు సినీ పండితులు. మరి ఈ మూవీకి ఎదురైన కష్టాలు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ మూవీ పుష్ప 2కు కష్టాలు తప్పేలా లేవు. అయితే ఈ కష్టాలు తెలుగు పరిశ్రమలో కాదులెండి, మిగతా ఇండస్ట్రీస్ లో. అసలు విషయం ఏంటంటే? బాలీవుడ్ లో బన్నీ సినిమాకు సోలో రిలీజ్ మిస్ అయ్యింది. ఆగస్ట్ 15న వస్తున్న పుష్ప 2కు పోటీగా అక్కడ జాన్ అబ్రహం మూవీ రిలీజ్ కానుంది. దాంతో భారీ ఓపెనింగ్స్ పై కన్నేసిన సుకుమార్ అండ్ కోకు ఊహించని షాక్ తగిలినట్లు అయ్యింది. ఇది సరేకదా అని అనుకున్న సమయంలో కోలీవుడ్ లో కూడా ఇదే కష్టం ఎదురైంది బన్నీకి.

it will be a huge blow to the collections 02

అక్కడ పుష్ప 2 విడుదల చేసే రోజే.. చియాన్ విక్రమ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘తంగళాన్’ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు గానీ.. వార్తలు మాత్రం పుష్కలంగా వస్తున్నాయి. బన్నీకి పోటీగా అక్కడ విక్రమ్ సినిమా వస్తే.. పుష్పరాజ్ కు కష్టాలు తప్పవు. ఎందుకంటే? కోలీవుడ్ లో విక్రమ్ కు సాలిడ్ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో బన్నీ మూవీ కలెక్షన్లపై భారీ దెబ్బ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. పుష్ప 2 రిలీజ్ వాయిదా పడింది అన్న వార్తల నేపథ్యంలో అజయ్ దేవ్ గన్ నటించిన ‘సింగం ఎగైన్’ చిత్రం తెరపైకి వచ్చింది.

బన్నీ ఆగస్ట్ 15న రాకుంటే.. అజయ్ దేవ్ గన్ ఆ డేట్ ను లాక్ చేయాలని చూస్తున్నాడు. కాగా.. పుష్పరాజ్ కంటే ముందుగానే సింగం మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఆ డేట్ కు పుష్ప 2 వస్తుండటంతో.. సింగం టీమ్ వెనక్కి తగ్గింది. ఇక పెద్ద హీరోల సినిమాలు సోలో రిలీజ్ అయితే.. భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతాయి. ఇలాంటి విడుదల కోసమే మేకర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్, కోలీవుడ్ లో పుష్ప 2కు ఈ కష్టాలు తప్పేలా లేవు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి