iDreamPost
android-app
ios-app

వీడియో: నిద్రపోతున్న భర్తపై వేడి నీళ్ళు పోసిన భార్య! ఎందుకుంటే?

వీడియో: నిద్రపోతున్న భర్తపై వేడి నీళ్ళు పోసిన భార్య! ఎందుకుంటే?

విజయవాడలో దారుణం జరిగింది. ఓ భార్య భర్త నిద్రపోతున్న సమయంలో అతనిపై సలసల మరిగే వేడి నీళ్ళు పోసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సోయి మరిచి నిద్రపోతున్న భర్తపై భార్య ఎందుకు అలా చేసింది? అందుకు దారి తీసిన కారణాలు ఏంటంటే? పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడలోని వన్ టౌన్ చిట్టి నగర్ లో దుర్గారావు-శ్రావణి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే ఎలాంటి మనస్పర్థలు లేకుడా వీరి కాపురం సజావుగానే సాగుతూ వస్తుంది.

ఇదిలా ఉంటే.. గత కొంత కాలం నుంచి భర్త దుర్గరావు తాగుడుకు బానిసైనట్లు తెలుస్తుంది. రోజూ మద్యం తాగి భార్యను వేధించేవాడట. ఇక మద్యం తాగుడు మానుకోవాలని భార్య భర్తకు అనేక సార్లు చెప్పినట్లు తెలుస్తుంది. అయినా భర్త తీరు మాత్రం మారలేదు. ఇదే విషయంపై దంపతులు రోజూ గొడవ పడేవారని సమచారం. ఇదిలా ఉంటే.. ఆదివారం కూడా ఈ భార్యాభర్తలు మరోసారి గొడవ పడ్డారు. దీంతో భార్య శ్రావణి భర్తపై కోపంతో ఊహించని నిర్ణయం తీసుకుంది. దుర్గారావు నిద్రపోతున్న సంగతి తెలుకున్న శ్రావణి అతనిపై సలసల మరిగే వేడి నీళ్ళు పోయడంతో అతడు ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశాడు.

ఏం జరిగిందని స్థానికులు అప్రమత్తమై వారి ఇంట్లో వచ్చి చూడగా.. దుర్గారావు వేడి నీళ్ళకు చర్మం అంతా ఊడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కొందరు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తాగొస్తున్నాడని భర్తపై వేడి నీళ్ళు పోసిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాంబు అంటూ ఫోన్ కాల్.. విమానాశ్రయంలో హై అలెర్ట్!

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş