iDreamPost

పూర్ణ నటించిన ఆ మూవీకి హీరోగా ఫస్ట్ అనుకున్నది విజయ్‌నే: రవిబాబు

Vijay Deverakonda, Poorna Movie Missed: పూర్ణ హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ మిస్ అయ్యింది. అవును ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు వెల్లడించారు. ఆ సినిమాకి ముందు అనుకున్నది విజయ్ దేవరకొండనే అని ఆయన చెప్పుకొచ్చారు.

Vijay Deverakonda, Poorna Movie Missed: పూర్ణ హీరోయిన్ గా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ మిస్ అయ్యింది. అవును ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు వెల్లడించారు. ఆ సినిమాకి ముందు అనుకున్నది విజయ్ దేవరకొండనే అని ఆయన చెప్పుకొచ్చారు.

పూర్ణ నటించిన ఆ మూవీకి హీరోగా ఫస్ట్ అనుకున్నది విజయ్‌నే: రవిబాబు

కొన్ని సినిమాలకు మొదట ఒక హీరోని అనుకుంటే ఆ తర్వాత మరొక హీరోని తీసుకుంటారు. హీరోయిన్స్ విషయంలోనూ అంతే. దర్శకుడు తన కథ కోసం ముందు ఒక హీరోని అనుకుంటే.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వేరే హీరోతో చేయాల్సి వస్తుంది. కథ నచ్చకపోవడం వల్ల కావచ్చు లేక సూట్ కాదని సున్నితంగా తిరస్కరించడం వల్ల కావచ్చు.. లేక డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కావచ్చు.. కారణం ఏదైనా గానీ కొన్నిసార్లు సినిమాలు ఫస్ట్ అనుకున్న హీరోలతో కాకుండా వేరే హీరోలతో చేయాల్సి వస్తుంది. భద్ర సినిమా జూనియర్ ఎన్టీఆర్ చేయాలి.. కానీ రవితేజకు వెళ్ళింది. ఆర్య సినిమా ఎన్టీఆర్ చేయాలి కానీ అల్లు అర్జున్ కి వెళ్ళింది. అతడు, పోకిరి సినిమాలు పవన్ కళ్యాణ్ కోసం పుట్టాయి. కానీ ఆ తర్వాత మహేష్ ఖాతాలోకి వెళ్లాయి. డార్లింగ్ సినిమా మొదట చరణ్ కాంపౌండ్ కి వెళ్ళింది. కానీ ఆ సినిమా ప్రభాస్ కే బాగుంటుందని చెప్పడంతో డార్లింగ్ వచ్చింది.

ఇలా చాలా సినిమాలు ఒకరితో అనుకుంటే మరొకరితో అవుతాయి. రవిబాబు సినిమాలో కూడా ముందు విజయ్ దేవరకొండనే అనుకున్నారట. పూర్ణ నటించిన అవును సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీలో పూర్ణ సరసన హర్షవర్ధన్ రానే నటించారు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా ముందు అనుకున్నది విజయ్ దేవరకొండనే అట. ఈ విషయాన్ని దర్శకుడు రవిబాబు వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మీ విషయంలో విజయ్ దేవరకొండ హర్ట్ అయ్యారట నిజమేనా అని అడగ్గా.. రవిబాబు స్పందించారు. విజయ్ హర్ట్ అయ్యారో లేదో తనకు తెలియదని.. ఆ విషయం తనకెప్పుడూ చెప్పలేదని అన్నారు.

విజయ్ తనతో నువ్విలా సినిమాలో నటించాడని.. తనకు తెలిసిన ఒక వ్యక్తి విజయ్ ని పరిచయం చేశాడని.. తాను అనుకున్న పాత్రకు విజయ్ అయితే బాగుంటాడనిపించిందని అన్నారు. అవును సినిమా కోసం ముందు విజయ్ నే ఎంపిక చేశానని.. తనైతే కరెక్ట్ గా సెట్ అవుతాడనిపించిందని అన్నారు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మూడు యాడ్స్ కి పని చేశామని.. అయితే అవును షూటింగ్ సమయానికి విజయ్ అందుబాటులో లేకపోవడంతో హర్షవర్ధన్ రానేను ఎంపిక చేశానని అన్నారు. విజయ్ తో ఇప్పటికీ తాను టచ్ లోనే ఉన్నానని.. ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయ్ తో కలిసి నటించా అని అన్నారు. ఇక పూర్ణ నటించిన అవును సినిమా ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించింది. ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు రవిబాబు ‘అవును 2’ని తెరకెక్కించారు. ప్రస్తుతం రవిబాబు కథ అందిస్తూ నిర్మించిన సినిమా రష్. ఈ నెల 13న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కానుంది. మరి అవును సినిమాలో విజయ్ దేవరకొండ నటించి ఉంటే.. పూర్ణ, విజయ్ ల కాంబో ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి