iDreamPost

పెళ్లి-వైవాహిక జీవితంపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అలాగే ఉండాలంట!

  • Author singhj Published - 09:04 PM, Thu - 13 July 23
  • Author singhj Published - 09:04 PM, Thu - 13 July 23
పెళ్లి-వైవాహిక జీవితంపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అలాగే ఉండాలంట!

రౌడీస్టార్ విజయ్ దేవరకొండకు యూత్​లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మేనరిజమ్స్, యాటిట్యూడ్​, లుక్స్​, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది ఫ్యాన్స్​ హృదయాల్లో ఆయన ప్లేస్​ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పాలి. టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. అందుకే ఆయన నటించిన ‘లైగర్’ మూవీని పాన్ ఇండియా రేంజ్​లో భారీగా రిలీజ్​ చేశారు. కానీ ఆ చిత్రం రౌడీస్టార్​కు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫెయిల్యూర్ నుంచి కోలుకునేందుకు విజయ్​తో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్​కు చాలా టైమ్ పట్టింది.

‘లైగర్’ రిజల్ట్ నుంచి తేరుకున్న విజయ్ దేవరకొండ తన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆయన ఒప్పుకున్న చిత్రమే ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విజయ్ సరసన సమంత కథానాయికగా యాక్ట్ చేస్తున్నారు. ‘ఖుషి’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను బహు భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా ‘ఆరాధ్య..’ అనే పాట రిలీజైంది. ఇందులో సమంత, విజయ్​ల మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటపై తాజాగా రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పెళ్లి చేసుకున్నాక ఈ సాంగ్​లో చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

‘ఖుషి’ ఫిల్మ్​లో తనకు ఇష్టమైన పాటల్లో ‘ఆరాధ్య..’ ఒకటని విజయ్ చెప్పుకొచ్చారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏడాది పాటు జంట ఎలా ఉంటుందో ఈ సాంగ్​లో చూపించామని తెలిపారు. ఈ పాటలో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించామని పేర్కొన్నారు. తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని.. కానీ ఫ్యూచర్​లో తన వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నానని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. ఇకపోతే, గత కొన్నాళ్లుగా విజయ్, రష్మికా మందన్న లవ్​లో ఉన్నారనే న్యూస్ ప్రచారంలో ఉంది. రీసెంట్​గా డిన్నర్ డేట్స్, హాలీడే వెకేషన్స్​కు వెళ్లి రావడం ఆ గాసిప్స్​కు మరింత ఆజ్యం పోసినట్లయింది. అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఇప్పటికే ఈ జంట పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి