iDreamPost
android-app
ios-app

‘డార్లింగ్’ అని రష్మిక ఒక్కదాన్నే అనలేదు.. విజయ్ ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Published - 10:50 AM, Fri - 29 September 23
  • Author ajaykrishna Published - 10:50 AM, Fri - 29 September 23
‘డార్లింగ్’ అని రష్మిక ఒక్కదాన్నే అనలేదు.. విజయ్ ట్వీట్ వైరల్!

ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో పండించిన కెమిస్ట్రీకి అందరు ఫిదా అయిపోయారు. ఏకంగా ఇద్దరు లవ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం చేసేసారు. అసలు విజయ్, రష్మికల మధ్య ఏముందో పక్కన పెడితే.. వీరు జంటగా ఎక్కడ కనిపించినా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోతుంది. ఎయిర్ పోర్ట్, మూవీ ఫంక్షన్స్, డిన్నర్.. ఇలా ఎక్కడ ఎదురుపడినా.. వీళ్ళ రిలేషన్ షిప్ గురించి వార్తలు గుప్పుమంటాయి. ఒకరికొకరు చిన్న ట్వీట్ పెట్టి విష్ చేసుకున్నా అంతే.

ప్రస్తుతం విజయ్, రష్మికలకు సంబంధించి అలాంటి ప్రచారమే జరుగుతుంది. తాజాగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన యానిమల్ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాడు. రణబీర్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన యానిమల్ టీజర్.. ఆడియన్స్ నుండి నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రెజెంట్ ఇండియాలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గా యానిమల్ టీజర్ వైరల్ అవుతోంది. అయితే.. ఈ టీజర్ రిలీజ్ సందర్బంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో మూవీ టీమ్ ని విష్ చేశాడు.

విజయ్ ట్వీట్ చేస్తూ.. ‘విషింగ్ మై డార్లింగ్స్ రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా.. మై ఫేవరేట్ హీరో రణబీర్ కపూర్’ అని అన్నాడు. దానికి రష్మిక స్పందించి.. “థ్యాంక్యూ! యువర్ ది బెస్ట్” అని రిప్లై ఇచ్చింది. దీంతో విజయ్ రష్మికని డార్లింగ్ అన్నాడని వార్తలు పుట్టుకొచ్చేసాయి. అంతటితో ఆగకుండా వాళ్ళ రిలేషన్ షిప్ గురించి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. విజయ్ డార్లింగ్ అని రష్మిక ఒక్కదాన్నే అనలేదు. తనకు అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి కెరీర్ నిలబెట్టిన సందీప్ రెడ్డిని కూడా అన్నాడు. సో.. రష్మిక ఒక్కదాన్ని కలిపి ప్రచారం చేయొద్దని, అక్కడ ఉద్దేశం ఏంటనేది పూర్తిగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ప్రస్తుతం విజయ్, రష్మికల ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి వీరి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom Giriş