iDreamPost
android-app
ios-app

ఖుషి ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రౌడీ హీరో డ్రెస్‌.. ధర ఎంతో తెలుసా?

  • Published Aug 16, 2023 | 9:43 AM Updated Updated Aug 16, 2023 | 9:43 AM
  • Published Aug 16, 2023 | 9:43 AMUpdated Aug 16, 2023 | 9:43 AM
ఖుషి ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రౌడీ హీరో డ్రెస్‌.. ధర ఎంతో తెలుసా?

విజ​య్‌ దేవరకొండ.. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. ఒకే జానర్‌ కాకుండా వేర్వురు రకాల కథలు ట్రై చేస్తూ.. కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు విజయ్‌ దేవరకొండ. అయితే గత కొంత కాలంగా సరైన హిట్‌ పడలేదు విజయ్‌ ఖాతాలో. పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన లైగర్‌.. దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా రిజల్ట్‌ విజయ్‌ మీద బాగానే ప్రభావం చూపిందని చెప్పవచ్చు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు.

ఇక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ, సమంత జోడిగా నటించిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం (ఆగస్టు 15) రాత్రి హైదరాబాద్‌లో ‘మ్యూజికల్‌ కన్సెర్ట్‌’ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానుల్లో జోష్ నింపారు సమంత, విజయ్ దేవరకొండ. ఇక ఈ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ ధరించిన డ్రెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడనే కాదు.. కెరీర్‌ ప్రారంభం నుంచి కూడా విజయ్‌ ఫ్యాషన్‌ విషయంలో ప్రత్యేక ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నాడు.

తానే స్వయంగా రౌడీ బ్రాండ్‌ పేరుతో.. ఎక్కడాలేని డిజైన్స్‌తో దుస్తులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించి ప్రీరిలీజ్‌, ప్రమోషన్‌ ఈవెంట్స్‌కు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తులు ధరించి వచ్చి.. ఫ్యాషన్‌కు కెరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇక తాజాగా ఖుషి మ్యూజికల్‌ కన్సర్ట్‌ కూడా ఇలానే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన డ్రెస్‌ ధరించి వచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించాడు రౌడీ హీరో. వైట్‌ కలర్‌ కోట్‌ మోడల్‌లో ఉన్న షర్ట్‌, దానితో పాటు.. వైట్‌ కలర్‌ పలోజా మోడల్‌ ప్యాట్‌ ధరించి వచ్చాడు విజయ్‌.

ఖుషి మ్యూజికల్‌ కన్సర్ట్‌లో విజయ్‌ డ్రెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ డ్రెస్‌ గురించే జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ డ్రెస్‌ని విజయ్‌ తన కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్నాడు.. మార్కెట్‌లో ఇది మరొక పీస్‌ ఎక్కడా లభించదు అంటున్నారు. ఇక ఈ డ్రెస్‌ ఖరీదు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet