iDreamPost

VHP నేత సంచలన వ్యాఖ్యలు.. ‘అసదుద్దీన్‌ రామనామ స్మరణ చేయక తప్పదు’

  • Published Jan 21, 2024 | 3:33 PMUpdated Jan 21, 2024 | 3:33 PM

VHP Leader-Asaduddin Owaisi: అయోధ్య మందిరం ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న వేళ.. ఏఐఎంఐఎం, వీహెచ్‌పీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా వీహెచ్‌పీ నేత ఒకరు అసదుద్దీన్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

VHP Leader-Asaduddin Owaisi: అయోధ్య మందిరం ప్రారంభోత్సవం దగ్గర పడుతున్న వేళ.. ఏఐఎంఐఎం, వీహెచ్‌పీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఈ క్రమంలో తాజాగా వీహెచ్‌పీ నేత ఒకరు అసదుద్దీన్‌ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 21, 2024 | 3:33 PMUpdated Jan 21, 2024 | 3:33 PM
VHP నేత సంచలన వ్యాఖ్యలు.. ‘అసదుద్దీన్‌ రామనామ స్మరణ చేయక తప్పదు’

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత నుండి ప్రస్తుత రామమందిరం నిర్మాణం వరకు అంతా ఓ క్రమ పద్దతిలో జరిగిందన్నారు. అంతేకాక ముస్లింలు గత 500 ఏళ్లుగా ప్రార్థనలు చేసిన బాబ్రీ మసీదును స్వాధీనం చేసుకుని.. దాన్ని కూల్చివేసి.. ఆ స్థలంలో రాముడి ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. అంతటితో ఆగక.. భారతీయ ముస్లింల నుంచి బాబ్రీ మసీదును లాక్కున్నారంటూ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనకు కౌంటర్‌ ఇస్తూ.. వీహెచ్‌పీ నేత ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అసదుద్దీన్‌తో పాటు ఎంఐఎం నాయకులంతా రామ భక్తులుగా మారతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

అయోధ్య రామమందిరం నిర్మించిన స్థలం ముస్లింలదే అనేలా మాట్లాడిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. విశ్వహిందు పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ భన్సల్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బాబ్రీ మసీదుది 500 ఏళ్ల చరిత్ర అంటున్నావు.. మరి మీ పూర్వీకులు ఎవరైనా సందర్శించారా అని ఈ సందర్భంగా వినోద్‌ భన్సల్‌ ప్రశ్నించారు.

అంతేకాక అసదుద్దీన్‌ లండన్ లో న్యాయవిద్య చదివిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మరి మీరెందుకు బాబ్రీ మసీదు కోసం కోర్టుకు వెళ్లలేదు అని నిలదీశారు. అంతేకాక రామమందిర ప్రారంభోత్సవ సమయంలో అసదుద్దీన్‌.. ఆలయం నిర్మించిన స్థలం ముస్లింలదని అనడం ముమ్మాటికీ రాజకీయ ప్రయోజనం కోసమే అని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టగూడదన్నారు.

అంతేకాక వినోద్‌ భన్సల్‌ మాట్లాడుతూ.. త్వరలోనే అసదుద్దీన్ ఓవైసితో సహా ఎంఐఎం నాయకులంతా రామ భక్తులుగా మారతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి చెందినవారంతా రామనామ స్మరణ చేసే రోజులు దగ్గర్లోనే వున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇక మరి కొన్ని గంటల వ్యవధిలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.

అంతేకాక రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తరలి వచ్చే భక్తులకు ఉచితంగా దర్శనం కల్పించడమే కాక ప్రసాదం, భోజనం సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు. అలానే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి