iDreamPost
android-app
ios-app

చిరంజీవికి చెప్పిన కథతో వెంకటేష్ తో సినిమా చేయనున్న అనిల్ రావిపూడి!

  • Published Feb 12, 2024 | 4:55 PM Updated Updated Feb 12, 2024 | 4:55 PM

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే ఫన్ కి కేరాఫ్ అడ్రెస్ అని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. త్వరలో ఆయన కొత్త మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా అంటే ఫన్ కి కేరాఫ్ అడ్రెస్ అని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు. త్వరలో ఆయన కొత్త మూవీని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

  • Published Feb 12, 2024 | 4:55 PMUpdated Feb 12, 2024 | 4:55 PM
చిరంజీవికి చెప్పిన కథతో వెంకటేష్ తో సినిమా చేయనున్న అనిల్ రావిపూడి!

దర్శకుడు అనిల్ రావిపూడి మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరొక ప్రాజెక్ట్ కోసం కలిసి పని చేయనున్నారనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి తెరపైకి రావచ్చని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్ వద్దకు ఈ సినిమా ఎలా వచ్చిందనే దాని వెనక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తుంది.

చాలా కాలంగా, దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, చివరి దశలో కథా చర్చలు అనుకున్న విధంగా సాగలేదట. ఇక ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర అనే బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నందున ఆయన ఇమేజ్ కు సరిపోయేలా సినిమా ఉండాలని కోరారట. ఆ తరువాత రావిపూడి తనతో ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో పనిచేసిన వెంకటేష్ తలుపు తట్టడంతో ఆయన వెంటనే కథను ఓకే చేశారని అంటున్నారు. ఎఫ్2 ఫ్రాంచైజీ వంటి కామెడీ కంటెంట్ తో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన భగవంత్ కేసరి వంటి సీరియస్ మూవీ రెండింటినీ సమర్థవంతంగా తీసిన దర్శకుడు అనిల్ రావిపూడి. అలాంటి అనిల్ స్క్రిప్ట్‌ను మెగాస్టార్ ఎందుకు తిరస్కరించారని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే కొంతమంది మెగా అభిమానులు మాత్రం రావిపూడి స్టైల్ చిరంజీవికి అంతగా నప్పదని అభిప్రాయ పడుతున్నారు.

ఇక వెంకటేష్ తో రావిపూడి తీయబోయే సినిమా ఎఫ్2 సీరీస్ లో భాగం కాదని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని వినికిడి. వెంకీ – రావిపూడి కాంబినేషన్ నుండి ఆశించే కామెడీ ప్రధానంగా ఉంటుంది. మరి హ్యాట్రిక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం. వెంకటేష్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కాబట్టి తదుపరి సినిమాతో తమ అభిమాన హీరో గట్టి హిట్ కొట్టాలని వెంకటేష్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి.. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ లపై వస్తున్న ఈ వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş