iDreamPost
android-app
ios-app

సైందవ్ టీజర్.. వెంకీ నుండి ఊహించని ఊరమాస్ ఇది!

  • Author ajaykrishna Published - 01:59 PM, Mon - 16 October 23
  • Author ajaykrishna Published - 01:59 PM, Mon - 16 October 23
సైందవ్ టీజర్.. వెంకీ నుండి ఊహించని ఊరమాస్ ఇది!

టాలీవుడ్ లో హీరో వెంకటేష్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ మధ్య కొంచం డల్ అయిన వెంకీ నుండి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోలో హీరోగా వెంకీ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా రోజులైంది. నారప్ప సినిమా చేసినప్పటికీ.. అది తమిళ సినిమా రీమేక్. పైగా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటిటి రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత దృశ్యం 2 చేసినా.. అది మలయాళం రీమేక్. గతేడాది ‘F3’తో అలరించాడు. కానీ.. అది కామెడీ ఎంటర్టైనర్. వెంకీ నుండి సాలిడ్ యాక్షన్ మూవీ కోరుకుంటున్నారు ఫ్యాన్స్. దానికి సమాధానం ఇప్పుడు తెరకెక్కుతున్న ‘సైందవ్’ అనే అంటున్నాయి సినీవర్గాలు.

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న 75వ సినిమా సైందవ్. హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్, కాస్టింగ్ చూసినప్పటి నుండి ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని హుక్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా దసరా ఫెస్టివల్ సమీపిస్తుండటంతో సైందవ్ టీజర్ రిలీజ్ చేశారు. ఖచ్చితంగా యూనిక్ కంటెంట్ తో వస్తున్నారని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. డైరెక్టర్ శైలేష్ ఈసారి క్రైమ్ థ్రిల్లర్ కాకుండా సాలిడ్ రివేంజ్ యాక్షన్ ని చూపించబోతున్నాడు. చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో కథ సాగనుందని టాక్.

లేటెస్ట్ టీజర్ చూసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ అంచనాలు రెట్టింపు అవుతాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. టీజర్ లో వెంకీ స్టైల్, స్వాగ్.. సీరియస్ డైలాగ్స్.. మాస్ లుక్ అన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. మణికందన్ సినిమాటోగ్రఫీ.. ప్రొడక్షన్ వాల్యూస్.. లాస్ట్ లో “ముందే చెప్పి వెళ్ళా.. వినలేదు. అంటే.. భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొడకల్లారా..” అని వెంకీ నోటి నుండి వచ్చిన మాస్ డైలాగ్.. అన్ని సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. కాగా.. ఈ సినిమాలో వెంకీ జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది. నవాజుద్దీన్ సిద్ధికి.. రుహాని శర్మ, ఆండ్రియా.. ఆర్య కీలకపాత్రలలో నటిస్తున్నారు. మరి సైందవ్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique