iDreamPost

డైరెక్ట్ గా OTT లోకి బ్రహ్మానందం కామెడీ ఎంటర్టైనర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 17, 2024 | 1:07 PMUpdated Jun 17, 2024 | 1:07 PM

Brahmanandam New Comedy Movie In OTT: థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కొన్నైతే.. డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయ్యే సినిమాలు మరికొన్ని .. ఇప్పుడు నేరుగా ఓటీటీ లకు వచ్చే సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోతుంది.

Brahmanandam New Comedy Movie In OTT: థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు కొన్నైతే.. డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయ్యే సినిమాలు మరికొన్ని .. ఇప్పుడు నేరుగా ఓటీటీ లకు వచ్చే సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోతుంది.

  • Published Jun 17, 2024 | 1:07 PMUpdated Jun 17, 2024 | 1:07 PM
డైరెక్ట్ గా  OTT లోకి బ్రహ్మానందం కామెడీ ఎంటర్టైనర్ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలనే ఓటీటీ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ థియేటర్ లో చూసిన సినిమాల కోసమే ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూసే ప్రేక్షకులు.. ఇక డైరెక్ట్ గా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయంటే.. ఇంకెంత ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలకు డిమాండ్ బాగానే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇలా చాలా సినిమాలు రిలీజ్ అయ్యి .. సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అవ్వబోతుంది. అది కూడా కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించిన సినిమా. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవ్వబోతుందో వెంటనే చూసేద్దాం.

కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి.. ప్రేక్షకులను నవ్వించి.. అందరి హృదయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ఇక ఇప్పుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “వీరాంజనేయులు విహార యాత్ర”. ఈ సినిమాకు సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీడకోలా ఫేమ్ రాగ్ మయూర్ , ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో.. ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు మేకర్స్. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అని. ఈ సినిమా కథ ఇది అని.. ఇప్పుడే ఓ అంచనాకు రాలేములే కానీ.. చిన్న స్టోరీ లైన్ ను మాత్రం చూసేద్దాం. ఈ సినిమాలో ఎప్పుడు గొడవలు పడే ఓ ఫ్యామిలీ పాత కాలం నాటి వ్యాన్ లో.. గోవా వెళ్లాలని అనుకుంటారు. ఈ జర్నీ లో వారికి ఎదురైనా పరిణామాలేంటి అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. దీనికి సంబంధించిన అప్ డేట్ ను.. తాజాగా ఫాథర్స్ డే సంధర్బంగా.. ఓ ఫన్నీ వీడియో ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి