iDreamPost

ప్రముఖ నటి ఖుష్బూపై ఫిర్యాదు!

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏ వ్యాఖ్యలు చేసినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని వాళ్లకు పాజిటీవ్ అయితే.. కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏ వ్యాఖ్యలు చేసినా ఇట్టే వైరల్ అవుతున్నాయి. కొన్ని వాళ్లకు పాజిటీవ్ అయితే.. కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ప్రముఖ నటి ఖుష్బూపై ఫిర్యాదు!

సినీ ఇండస్ట్రీలో రాణించిన నటీనటులు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తమ సత్తా చాటిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో ప్రముఖ నటి ఖుష్బూ స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె తర్వాత హీరోయిన్ గా ఒక చిత్రంలో నటించింది.. కానీ పెద్దగా పేరు రాలేదు. తెలుగులో విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించిన ‘కలియుగ పాండవులు’ సూపర్ హిట్ కావడంతో వరుసగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఛాన్సులు దక్కించుకొని నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. కొంతకాలం క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు అయిన ఖుష్బూపై ఫిర్యాదు రావడం ఇండస్ట్రీ, రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

నటి ఖుష్బూపై అట్రాసిటి చట్టం కింద చర్యలు తీసుకోవాలని వీసీకే తరుపున పోలీస్ కమీషనర్ ఆఫీస్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల నటి త్రిషపై.. నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేధికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘మీలా లోకల్ భాషలో మాట్లాడలేను’ అని చెప్పింది. దీనిపై పలు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలోనే దళితులు మాట్లాడే భాషను కించపరిచి, తక్కువ చేశారని  ఖుష్బూపై అట్రాసిటి చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమీషనర్ కార్యాలయంలో వీసీకే నేతలు ఫిర్యాదు చేశారు.

ఎస్సీలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఖుష్బు చేసిన ట్వీట్ పై తమిళ కాంగ్రెస్‌ కమిటీ ఎస్సీ విభాగం భగ్గుమంది. ఈ నేపథ్యంలోనే కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక రాజకీయ నాయకురాలై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అంటూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహనటి త్రిష వ్యవహారంలో ఎంతో ఆసక్తి చూపిస్తున్న నటి ఖుష్బు.. ఇటీవల మణిపూర్ మహిళలపై అరాచకాలు జరిగినపుడు ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు తొలగించి బహిరంగంగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టి నిరసన తెలుపుతామని అన్నారు. ఈ వివాదంపై నటి ఖుష్బూ ఎలా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి