iDreamPost

వారసుడికి అడ్వాన్స్ 100 కోట్లు

ఇంకా థియేట్రికల్ ఫిగర్స్ ఒక కొలిక్కి రాకముందే శాటిలైట్ ప్లస్ ఓటిటిలో వంద కోట్లకు పైగా లాగేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో అరసు టైటిల్ తో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తాలూకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఇంకా థియేట్రికల్ ఫిగర్స్ ఒక కొలిక్కి రాకముందే శాటిలైట్ ప్లస్ ఓటిటిలో వంద కోట్లకు పైగా లాగేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో అరసు టైటిల్ తో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తాలూకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

వారసుడికి అడ్వాన్స్ 100 కోట్లు

తమిళ స్టార్ హీరో విజయ్ తో నిర్మాత దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న వారసుడు తాలూకు బిజినెస్ డీల్స్ క్రేజీగా ఉన్నాయి. ఇంకా థియేట్రికల్ ఫిగర్స్ ఒక కొలిక్కి రాకముందే శాటిలైట్ ప్లస్ ఓటిటిలో వంద కోట్లకు పైగా లాగేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో అరసు టైటిల్ తో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తాలూకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీనికి గాను 60 కోట్లకు ఒప్పందం సెట్ అయ్యిందట. టీవీ ప్రీమియర్స్ కోసం సన్ టీవీ ఏకంగా 50 కోట్లు ఆఫర్ చేసినట్టు చెన్నై టాక్. ఆడియో రైట్స్ కు టి సిరీస్ 10 కోట్లకు సిద్ధపడటమూ రికార్డే. అంటే ప్రొడక్షన్ ఖర్చు కంటే ఎక్కువ ఈ రూపంలో వచ్చేసింది.

తెలుగు తమిళం బైలింగ్వల్ అని తొలుత ప్రచారం చేశారు కానీ ఇది కేవలం అరవంలోనే తీస్తున్నారు. ఆ మధ్య నిర్మాతల టాలీవుడ్ స్ట్రైక్ జరిగినప్పుడు దిల్ రాజే ఈ మాట చెప్పారు కాబట్టి ద్విభాష అనడానికి లేదు. ఇక్కడ డబ్బింగ్ లోనే వస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న వారసుడులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. సీనియర్ ఆర్టిస్టులను భారీ సంఖ్యలో తీసుకున్నారు. కథ గురించి కొంత అజ్ఞాతవాసి లైన్ మీద ఉంటుందనే ప్రచారం జరిగింది కానీ అదేమి ఉండకపోవచ్చు. టైటిల్ ని బట్టి దూరమైన కుటుంబం కోసం తిరిగి వచ్చే హీరో కథని అంటున్నారు కానీ ఈ పాయింట్ తో చాలానే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఫలానాదేనని చెప్పలేం.
Advance to heir
వారసుడులో రష్మిక మందన్న హీరోయిన్. తుపాకీ నుంచి తెలుగు మార్కెట్ మీద కన్నేసిన విజయ్ ఈ కారణంగానే టాలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదిరింది, విజిల్, మాస్టర్ లు కమర్షియల్ గా పే చేయడంతో దాన్ని బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బీస్ట్ ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. బాగుందనే టాక్ వస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేంత ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది. అందుకే వారసుడు మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. మాములుగా తన ప్రీ రిలీజ్ ఈవెంట్లు వేరే రాష్ట్రాల్లో చేస్తే అడుగు పెట్టని విజయ్ దీనికి మాత్రం ప్రత్యేకంగా హైదరాబాద్ లో హాజరు కాబోతున్నాడట. 2023 సంక్రాంతికి రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి